టాలీవుడ్‌ ఇండస్ట్రీలో నేచురల్‌ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న నాని నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. నానితో పాటు ఆయన భార్య అంజనా కూడా సెలబ్రిటీ స్టేటస్‌ అందుకుంది. నాని తన సోషల్ మీడియా వేజ్‌లో రెగ్యులర్‌గా సినిమాల అప్‌డేట్స్‌తో పాటు పర్సనల్ మూమెంట్స్‌ను కూడా షేర్ చేస్తుంటాడు. దీంతో అభిమానులకు నాని భార్య అంజనా కూడా దగ్గరైంది.

ఈ నేపథ్యంలో తాజాగా అంజనా తనలోని మరో టాలెంట్‌ను కూడా చూపించింది. తాజాగా అంజనాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రేమికులు సినిమాలోని అందమైన ప్రేమరాణి పాటను అంజనా తన స్నేహితురాలితో కలిసి పాడింది. అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేసిందన్న అన్న విషయం తెలియక పోయినా.. నాని అభిమానులు వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

నాని సినిమాల విషయానికి వస్తే ఇటీవల గ్యాంగ్ లీడర్‌గా ఆకట్టుకున్న నాని ప్రస్తుతం వీ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో రెండు సినిమాలను కూడా ప్రకటించాడు నాని. శివా నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీష్‌తో పాటు, రాహుల్‌ సంక్రిత్యాన్ దర్శకత్వంలో శ్యామ్‌ సింగరాయ అనే సినిమాను చేస్తున్నాడు.