Asianet News TeluguAsianet News Telugu

ఆపండ్రోయ్... బ్రహ్మానందంలా భయపడ్డ హీరో నాని, గట్టిగా నవ్వేసిన మృణాల్, వీడియో వైరల్ 

హీరో నాని చిల్డ్రన్స్ డే నాడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేశాడు. ఓ వీడియోలో ఉయ్యాలా ఊగుతూ నాని తెగ భయపడిపోయాడు. 
 

hero nani shares a funny video on children s day ksr
Author
First Published Nov 14, 2023, 6:05 PM IST


నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన చిత్రాల ప్రమోషన్స్ తో పాటు పలు విషయాల మీద స్పందిస్తూ ఉంటాడు. నేడు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కాగా, కొన్ని వీడియోలు నాని పోస్ట్ చేశాడు. ఆ వీడియోల్లో ఒకటి ఫన్నీగా ఉంది. హిల్ ఏరియాలో ఉన్న ఊయల్లో కూర్చున్న నాని ని మృణాల్ ఠాకూర్ ఊపుతుంది. ఆపండ్రోయ్... అని అరుస్తూ నాని భయపడుతున్నాడు. దాంతో మృణాల్, పక్కనే ఉన్న పాప నవ్వేస్తున్నారు. ఇది హాయ్ నాన్న షూటింగ్ సెట్స్ లో జరిగిన సంఘటన కావొచ్చు... 

నాని నువ్వు నాకు నచ్చావ్ మూవీలోని బ్రహ్మానందం కామెడీ సీన్ ని గుర్తు చేశాడు. చెప్పాలంటే ఆయన్ని అనుకరించారు. ఆ సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కిన బ్రహ్మానందం స్పీడ్ అందుకున్నాక కేకలు వేస్తాడు. నువ్వు నాకు నచ్చావ్ లో ఈ కామెడీ సీన్ హైలెట్ అని చెప్పాలి. ఇక పోతే హాయ్ నాన్న విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రొమోషన్స్ షురూ చేశారు. డిసెంబర్ లో హాయ్ నాన్న విడుదల కావచ్చని సమాచారం. 

Also Read మునుపంటితో పెదాలను కొరుకుతూ.. బిగుతైన టాప్ లో రెచ్చిపోయి మృణాల్ ఠాకూర్ ఫోజులు..

హాయ్ నాన్న ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించాడు. మృణాల్ ఠాకూర్ మొదటిసారి నానితో జతకడుతుంది. బేబీ కియారా కన్నా కీలక రోల్ చేస్తుంది. జయరామ్, అంగద్ బేడీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. హాయ్ నాన్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

Follow Us:
Download App:
  • android
  • ios