నిజం విత్ స్మిత షోలో హీరో నాని, రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నెపోటిజం పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

నెపోటిజం వివాదాస్పద టాపిక్ గా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత దీనిపై మరింత చర్చ మొదలైంది. అవుట్ సైడర్ అయిన సుశాంత్ సింగ్ ని ఇబ్బందులకు గురి చేసి స్టార్ కిడ్స్, ఇండస్ట్రీ పెద్దలు ఆత్మహత్యకు పురిగొల్పారనే వాదన వినిపించింది. దాదాపు ఏడాది పాటు నెపో కిడ్స్ అయిన అలియా భట్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లను నెటిజన్స్ ఏకిపారేశారు. వారు నెలల పాటు సోషల్ మీడియాకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అసలు నెపోటిజం మంచిదా చెడ్డదా... అంటే కొందరు సమర్థిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయినప్పుడు హీరో కొడుకు హీరో అయితే తప్పేంటనే వాదన ఉంది. అలాగే టాలెంట్ లేకుండా స్టార్ హీరో వారసుడు అయినంత మాత్రానా ఎదగలేరని అంటారు. అదే సమయంలో వారసులను ప్రేక్షకుల మీద రుద్ది స్టార్స్ చేస్తున్నారని, అలాగే బ్యాక్ గ్రౌండ్ లేని నటులను తమ పిల్లల కోసం తొక్కేస్తున్నారనే వారు కూడా ఉన్నారు. 

Scroll to load tweet…

ఈ క్రమంలో నెపోటిజం ని ఉద్దేశిస్తూ హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజం విత్ స్మిత షోలో పాల్గొన్న నాని మాట్లాడుతూ... అసలు నెపోటిజంని పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నాని డెబ్యూ మూవీ లక్షల్లో చూస్తే రామ్ చరణ్ డెబ్యూ మూవీ కోట్లలో చూశారు. ఆ లెక్కన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది జనాలే కదా అన్నారు. ఈ షోలో రానా కూడా పాల్గొన్నారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద ఉందని రానా అన్నారు. పిల్లలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలి, అప్పుడే వాళ్ళు విజయం సాధించినట్లని రానా అన్నారు. 

వీరిద్దరిలో నాని అవుట్ సైడర్ కాగా, రానా నెపోకిడ్. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ సినిమా నేపథ్యం కలవారే. ఒక్క చిరంజీవి ఫ్యామిలీ నుండే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ గా అవతరించారు. మరో ముగ్గురు నలుగురు టైరు టు హీరోల జాబితాలో ఉన్నారు. కృష్ణ కుమారుడు మహేష్, కృష్ణంరాజు వారసుడు ప్రభాస్, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్స్ గా పరిశ్రమను ఏలుతున్నారు.