ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు విలన్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అటువంటి ప్రయోగం కూడా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు హీరో నాని కూడా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. 

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తోన్న సినిమాలో నాని విలన్ గా కనిపిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అది కాసేపే అని అంతా అనుకున్నారు. కానీ సినిమా మొత్తం కూడా నాని విలన్ గానే కనిపిస్తాడట.

సినిమాలో నానిదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ఇదే సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. తనది పోలీస్ క్యారెక్టర్. నాని విలన్ అయినప్పటికీ తెరపై అతడికి హీరోయిన్ ఉంటుంది.

ఆ పాత్ర కోసం అదితిరావుని ఎంపిక చేశారు. విలన్ పాత్ర అయినప్పటికీ హీరోయిజం ఏమాత్రం తగ్గకుండా చూపిస్తారట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.