దసరా మూవీ షూటింగ్ లో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుండి హీరో నాని తృటిలో తప్పించుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదకర స్టంట్స్ చేసే సమయంలో గాయాలపాలవుతూ ఉంటారు. తాజాగా హీరో నాని(Nani) పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు సమాచారం అందుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం గోదావరి ఖని కోల్ మైన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ లో భాగంగా బొగ్గు లోడుతో ఉన్న క్రింద నాని ఉన్నారట. పొరపాటున లారీలో ఉన్న బొగ్గు అన్లోడ్ చేశారట. మొత్తం బొగ్గు నాని పై పడేదట. ప్రమాదాన్ని గమనించిన నాని వేగంగా తప్పుకున్నారట.
ఆ సంఘటనతో యూనిట్ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారట. నానికి ఏమీ కాకపోవడంతో సంతోషం వ్యక్తం చేశారట. కాగా దసరా మూవీలో నాని డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. పెరిగిన జట్టు, గడ్డం, లుంగీ ధరించి ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని కీలక రోల్ చేస్తున్నారు. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో దసరా తెరకెక్కుతుంది.
వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ నాని సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. హిట్ టాక్ తెచ్చుకొని కూడా కనీస వసూళ్లు సాధించలేకపోయింది. నాని హీరోగా విడుదలైన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. శ్యామ్ సింగరాయ్ మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటింది.
