యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'హిట్'.  క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 2020 ఫిబ్రవరి 28న విడుదలైన హిట్... సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. హీరో నాని నిర్మాతగా హిట్ మూవీ తెరకెక్కింది. వాల్ పోస్టర్ బ్యానర్ లో నాని తన రెండవ చిత్రంగా హిట్ తెరకెక్కించారు. దర్శకుడు శైలేష్ కొలను డెబ్యూ మూవీగా ఇది తెరకెక్కింది. 

ఇంటెన్స్ థ్రిల్లర్ హిట్, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్ యాంగ్రీ పోలీస్ అధికారిగా కనిపించారు. కాగా హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు హీరో నాని. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.  సీక్వెల్ కి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. 

హిట్ సీక్వెల్ లో క్రైమ్ నేపథ్యం ఆంద్రప్రదేశ్ లో నడుస్తుందని నాని హింట్ ఇచ్చారు. ఇక ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు నాని నటించిన టక్ జగదీష్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. అలాగే మరో చిత్రం శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ విడుదల కాగా ఆసక్తి రేపుతోంది.