Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు సాహసం... ఆ ఇద్దరు స్టార్ హీరోలకు పోటీగా కన్నప్ప?


హీరో మంచు విష్ణు కన్నప్ప మూవీతో ఫార్మ్ లోకి రావాలని అనుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర విడుదల తేదీపై ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. 
 

hero manchu vishnu starer might release in dasara ksr
Author
First Published Feb 3, 2024, 11:02 AM IST | Last Updated Feb 3, 2024, 11:02 AM IST

మంచు విష్ణు ఒక్క హిట్ అంటూ తపిస్తున్నారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. కన్నప్ప టైటిల్ తో భక్తిరస చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర అధిక భాగం న్యూజిలాండ్ లో షూట్ చేస్తున్నారు. చిత్రీకరణకు కావాల్సిన ప్రాపర్టీస్ షిప్ లో ఆ దేశానికి పంపారు. ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. 

మంచు విష్ణుకు కనీస మార్కెట్ లేదు. అందుకే మాస్టర్ ప్లాన్ వేశాడు. టాప్ స్టార్స్ ని మూవీలో భాగం చేశాడు. ప్రభాస్ కన్నప్ప మూవీలో ఓ పాత్ర చేస్తున్నారు. ఆయన శివుడిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లు కన్నప్ప మూవీలో రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఎంట్రీతో మూవీకి మంచి ప్రచారం దక్కింది. 

కాగా ఈ చిత్ర విడుదల తేదీపై ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది. దసరా కానుకగా కన్నప్ప విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే దసరా బరిలో ఎన్టీఆర్ దేవర,  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు ఉన్నాయని సమాచారం. ఏప్రిల్ 5న దేవర విడుదలయ్యే అవకాశం లేదట. ఈ తేదీకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ప్రకటించారు. దేవర వాయిదా దాదాపు ఖాయమే. 

మరి అదే జరిగితే దేవర, గేమ్ ఛేంజర్ చిత్రాలతో కన్నప్ప పోటీ పడాల్సి వస్తుంది. దసరాకు లాంగ్ వీకెండ్ లభిస్తుంది. దసరా సెలవులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మూడు చిత్రాలు విడుదలైన కంటెంట్ ఉంటే కలెక్షన్ దక్కుతాయి. కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios