మంచు మనోజ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి సవాల్ విసిరారు. అందుకు నేను రెడీగా ఉన్నాను...నీవు రెడీనా అంటూ తన నిర్ణయం చెప్పమన్నాడు. ఇంతకీ మనోజ్ ఏ విషయంలో సాయి ధరమ్ తేజ్ కి సవాల్ విసిరాడంటే. నిన్న సాయి ధరమ్ బర్త్ డే జరుపుకున్నారు. ఈ సంధర్భంగా చిత్ర ప్రముఖులు మరియు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంచు మనోజ్ సైతం సాయి ధరమ్ తేజ్ కి బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. 

విషెష్ తో పాటు మంచు మనోజ్ ధరమ్ తేజ్ కి ఓ విషయం కూడా గుర్తు చేశాడు. 38ఏళ్ల క్రితం 1982లో చిరంజీవి మరియు మోహన్ బాబులతో బిల్లా రంగా అనే మల్టీస్టారర్ తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు కే ఎస్ ఆర్ దాసు తెరకెక్కించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ విషయాన్ని గుర్తు చేయడంతో పాటు ఆ చిత్రం మనం ఎందుకు చేయకూడదని పరోక్షంగా అడిగాడు. అలాగే బిల్లా రంగా రీమేక్ లో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను...నీవు సిద్దమేనా? అని సోషల్ మీడియా ద్వారా అడిగారు. 

మరి మంచు మనోజ్ విసిరిన సవాల్ కి సాయి ధరమ్ తేజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్న సాయి ధరమ్, ఆ తరువాత దేవా కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కాగా మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత అహం బ్రహ్మస్మి అనే భారీ భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఆ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.