2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్ బాబు కుటుంబం వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మంచు విష్ణు సైతం వైఎస్ జగన్ ని పలుమార్లు కుటుంబంతో పాటు కలవడం జరిగింది. 

మంచు హీరో మనోజ్ నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్ పరిపాలనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దార్శనిక పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వెళ్లబుచ్చారు. 

''సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను. మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు '' అని ట్వీట్‌ చేశారు.

ఇక 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్ బాబు కుటుంబం వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మంచు విష్ణు సైతం వైఎస్ జగన్ ని పలుమార్లు కుటుంబంతో పాటు కలవడం జరిగింది. ఈ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొని ఉన్నాయి. 

మరోవైపు తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వచ్చిన వార్తలను మనోజ్ ఖండించారు. త్వరలో తన లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చారు. 2019లో మనోజ్ అహం బ్రహ్మస్మి పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయినట్లు సమాచారం. 

Scroll to load tweet…