Asianet News TeluguAsianet News Telugu

`సైదాబాద్ చిన్నారి`పై మంచు మనోజ్‌ స్పందన..నిందితుడిని 24గంటల్లో ఉరి తీయాలని డిమాండ్‌

చిన్నారి తల్లితండ్రులను ఓదార్చారు. ఈ సందర్బంగా మంచు మనోజ్‌ మాట్లాడారు. చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అని, బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనందరం బాధ్యత వహించాలన్నారు. 

hero manchu manoj condolences to saidabad girl family and demand to be hanged
Author
Hyderabad, First Published Sep 14, 2021, 4:10 PM IST

హైదరాబాద్‌లోని సైదాబాద్‌కి చెందిన సింగరేణి కాలనీలోని చిన్నారి అత్యాచార ఘటనపై హీరో మంచు మనోజ్‌ స్పందించారు. మంగళవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి తల్లితండ్రులను ఓదార్చారు. ఈ సందర్బంగా మంచు మనోజ్‌ మాట్లాడారు. చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అని, బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనందరం బాధ్యత వహించాలన్నారు. 

`క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలి. ఇప్పటికీ నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. చత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఏడాది తర్వాత తీర్పు వచ్చింది. ఇలాంటి రాక్షసులను 24 గంటల్లో ఉరి తీయాలి` అని తెలిపారు. 

`పాపలేని లోటును మేం ఎవరం తీర్చలేం. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. పాపకు న్యాయం జరిగేవరకూ పోరాడతాం. ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నందుకు బాధగా ఉంది. ఈ జనరేషన్‌ నుంచి అయినా మగాడి ఆలోచనలు మారాలి`  అని అన్నారు.  `టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటామ`ని మంచు మనోజ్ పేర్కొన్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios