Asianet News TeluguAsianet News Telugu

కొత్త మూవీ స్టార్ట్ చేసిన మహేష్ మేనల్లుడు!


మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా రెండో సినిమాకు శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఆయన కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 
 

hero mahesh nephew ashok galla starts his second movie
Author
First Published Feb 6, 2023, 6:32 AM IST


మహేష్ అక్క కుమారుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన డెబ్యూ మూవీ 'హీరో' 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హీరో డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఆడకున్నా... హీరో అశోక్ గల్లాలో విషయం ఉందని తేల్చారు ప్రేక్షకులు. మొదటి సినిమాలోనే బెరుకు లేకుండా నటించిన అశోక్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీశారు. హీరో విడుదలైన ఏడాదికి రెండో మూవీ స్టార్ట్ చేశారు. 

ఫిబ్రవరి 5న హైదరాబాద్ లో అశోక్ గల్లా కొత్త మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, బోయపాటి శ్రీను, నమ్రతా శిరోద్కర్, ప్రశాంత్ వర్మ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అశోక్ గల్లాపై వెంకటేష్ క్లాప్ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీ లలితాంబిక బ్యానర్ లో ప్రొడక్షన్ 1 గా ఈ మూవీ తెరకెక్కుతుంది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. 

ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా మహేష్ తన మేనల్లుడు అశోక్ గల్లాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. తన చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. హీరో మూవీతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లాకు రెండో చిత్రం కమర్షియల్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. ఈ ఏడాది చివర్లో మూవీ విడుదలయ్యే సూచనలు కలవు. 

Follow Us:
Download App:
  • android
  • ios