మహేష్ బాబు కూతురు సితార డాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఆమె ట్రెడిషనల్ వేర్లో మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకుంది. సితార పెర్ఫార్మన్స్ కి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.  

సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పదేళ్ల ప్రాయంలోనే ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా సితార ట్రెడిషనల్ వేర్ ధరించి డాన్స్ వీడియో చేశారు. ఓ హిందీ పాటకు ఆమె సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సితార క్లాసిక్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. క్యూట్ బేబీ డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సితార వీడియో వైరల్ గా మారింది. 

View post on Instagram

త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. 

గౌతమ్ సోషల్ మీడియాను వాడడు. సితార మాత్రం తరచుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. సితారకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో పిల్లలకు సంబంధించిన వీడియోలు, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇక తరచుగా పేరెంట్స్ తో కలిసి విదేశీ టూర్లు వెళుతుంటారు. విదేశాల్లో తన ప్రతి మూమెంట్ కెమెరాలో బంధించి ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.