Asianet News TeluguAsianet News Telugu

`రాజావిక్రమార్క`గా రాబోతున్న హీరో కార్తికేయ..

`గ్యాంగ్ లీడర్`లో స్టయిలీష్ విలన్‌గానూ మెప్పించిన హీరో కార్తికేయ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ `రాజావిక్రమార్క`తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
 

hero kartikeya new movie rajavikramarka first look realesed by sandeep reddy vanga arj
Author
Hyderabad, First Published Jun 20, 2021, 2:30 PM IST

`ఆర్‌ఎక్స్ 100` తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు హీరో కార్తికేయ. ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గానూ నిలిచింది. ఆ తర్వాత హీరోగా, నటుడిగా తనని తాను నిరూపించుకునేందుకు, ఇండస్ట్రీలో నిలబడేందుకు సిన్సియర్‌గా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన సినిమాలు ఆడటం లేదు. దీంతో ఇప్పుడు మరోసారి డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో రాబోతున్నాడు. `గ్యాంగ్ లీడర్`లో స్టయిలీష్ విలన్‌గానూ మెప్పించిన ఆయన ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ `రాజావిక్రమార్క`తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయకిది 7వ చిత్రం. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి తాజాగా `రాజావిక్రమార్క` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్` చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ, `టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్  చేసిన ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగాకి కృతజ్ఞతలు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. కార్తికేయ నటన, పాత్ర చిత్రణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కథకు, హీరోకు పర్ఫెక్ట్ టైటిల్ `రాజావిక్రమార్క`. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీ నచ్చింది. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే  చిత్రమిది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించిన తర్వాత మిగతా భాగం పూర్తి చేసి, ఆ తర్వాత విడుదల వివరాలు వెల్లడిస్తాం` అని అన్నారు. 

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ, `సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు. పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు.  యాక్షన్ సన్నివేశాలను స్పెషల్ గా డిజైన్ చేశాం. అవి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్ ను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి.  యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మంచి బాణీలు అందించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం` అని చెప్పారు. 

ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి పీఆర్వో: పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

Follow Us:
Download App:
  • android
  • ios