బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కోసం పడి చచ్చిపోతున్నారు లేడీ ఫ్యాన్స్. ఊ అంటే చాలు ఎగరేసుకుపోతామంటున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆయన లేడీ ఫ్యాన్స్. ప్రస్తుం అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా లో నటిస్తున్నాడు.కార్తిక్ ఆర్యన్ అంటే యంగ్ లేడీ ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు. ఆయన ఊ అంటే చాలు ఎగరేసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అని చూస్తుంటారు. కార్తిక్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉంటూ ఓపిగ్గా వారికి ప్రశ్నలకు సమాదానం ఇస్తుంటాడు.
అందుకే ఈ హీరోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆయకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు.ఇక రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడు. ఇందులో అర్జున్ పాతక్ అనే అమ్మాయి ధమాకా సినిమాలోని డైలాగులను అద్భుతంగా చెప్పింది.. డైలాగ్ చెప్పడం పూర్తవగానే పెద్దగా నవ్వేశారు. ఈ ఇదరూ వీడియోలో క్యూట్ గా కనిపించడంతో నెటిజన్లు దీనిపై స్పందించడం మొదలు పెట్టారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈక్రమంలో ఒక నెటిజన్ మాత్రం 20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా ఆర్యన్ అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్ ఆర్యన్ కూడా బదులిస్తూ.. సరే ఎప్పుడు చేసుకుందాం? అని అడిగాడు. ఇక ఆమె సంతోషంతొ ఇప్పుడే వచ్చేయ్ పెళ్లి వెంటనే చేసుకుందాం అని రిప్లై ఇచ్చింది.
ఈ చర్చ ఇంతటితో ఆగలేదు. ఈ చాటింగ్ చూసిన మరికొందరు అమ్మాయిలు కూడా మేము కూడా ఇస్తా 20 కోట్లు నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లతో హీరో వెంటపడ్డారు. దీంతో కార్తీక్ ఆర్యన్ సరదాగా ఈ ఫన్నీచాట్ ను ముగించారు. వేలంపాట వేద్దామా అని సరదాగా చమత్కరించాడు బాలీవుడ్ హీరో. కార్తిక్ ఆర్యన్ కు లేడీ ఫ్యాన్స్ లో ఇంత డిమాండ్ ఉండటంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఇక కార్తీక్ ఆర్యన్ చివరిసారిగా ధమాకా సినిమాతో ఆడియన్స్ ముందు వచచాడు. ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ మూవీ షెహజాదా ను ఈ ఏడాది నవంబర్ 4న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. వీటితోపాటు ఆర్యన్ ఖాతాలో పాటు భూల్ భులాయా 2, ఫ్రెడ్డీ సినిమాలు కూడా ఉన్నాయి.
