Asianet News TeluguAsianet News Telugu

సర్దార్ లో లైలా పాత్ర ఎలా ఉండబోతుందంటే...? హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చాలా కాలం తరువాత తమిళ సినిమా సర్ధార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది క్రేజీ హీరోయిన్ లైలా. సొట్టబుగ్గలతో ఎంతో మంది కుర్రాళ్ల గుండెల్లో గాలం వేసిన లైలా.. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట. ఈ విషయంలో హీరో కార్తీ ఏమని కామెంట్స్ చేశాడంటే..? 
 

Hero Karthi Talk about Laila Role in Sardar Movie
Author
First Published Oct 18, 2022, 11:42 AM IST

తమిళ స్టార్ హీరో కార్తి నటిస్తున్న తాజా సినిమా సర్దార్. ఈ సినిమాతో 90 స్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంతో అటు తమిళ్ తో పాటు.. ఇటు తెలుగులో కూడా ఈసినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.  లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈమూవీలో కార్తీ  డిఫరెంట్ లుక్ తో  కనిపించనున్నాడు. అంతే కాదు సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ కూడా చేయబోతున్నాడు. 

ఇక దాదాపుగా 15 ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా  హీరోయిన్  లైలా రీ ఎంట్రీ ఇస్తుంది లైలా. సర్ధార్ సినిమాలో.. ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నాడు హీరో కార్తి. తన పాత్ర గురించి చెపుతూ.. లైలా గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కార్తి. తన సినిమాత్ో లైలా రీ ఎంట్రీ  ఇవ్వడం  చాలా సంతోషాన్ని కలిగించే విషయం అన్నారు కార్తి.  ఈ సినిమాకి తన పాత్ర చాలా కీలకమన్నారు. అంతే కాదు ఆమె పాత్ర వల్లనే ఈసినిమా  కథ మలుపు తిరుగుతుందట. సినిమాలో తనతో పాటు లైలాను చూసి ఆడియర్స్ థ్రిల్ ఫీల్ అవుతారు అన్న విధంగా చెప్పారు కార్తి. 

ఈ నెల 21 న రిలీజ్ కాబోతుంది సద్ధార్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. .ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కార్తి మాట్లాడుతూ .. 'సర్దార్' యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ డ్రామా. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా తేడా ఉంటుంది అన్నారు కార్తి. ఇలా కదా మనం కార్తిని చూడాలనుకున్నది అనే విధంగాచేశారట తమిళ హీరో. 

ఇక హీరోయిన్స్ గురించి చూసుకుంటే.. ఈమూవీలో రాశి ఖన్నాతో పాటు రజీషా విజయన్ కూడా నటించింది. అవ్వడానికి ఇద్దరు హీరోయిన్లు అయినా.. ఈ ఇద్దరు బ్యూటీస్ కు ప్రాధాన్యత కలిగిన పాత్రలు దక్కాయి. ఇక జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈసినిమాకు .. మ్యూజిక్ తో పాటు ఫొటోగ్రఫీ హైలెట్ కాబోతుంది.  రెండేళ్లపాటు స్క్రిప్ట్ పై కూర్చున్నాము .. ఏడాది పాటు షూటింగు చేశాము. అందుకు తగిన ఫలితాన్ని ఈ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది అంటా చెప్పుకొచ్చారు కార్తి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios