లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'రామబాణం'. ఈ చిత్రంలో బోల్డ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది.
లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'రామబాణం'. ఈ చిత్రంలో బోల్డ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
తరుణ్ రాజ్ అరోరా విలన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మే 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ రామబాణం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే రామబాణం చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ చక్కగా మిళితం చేసినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు మంచి ఆహారం, మంచి బంధాలు అనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ట్రైలర్ లో ఫన్ మూమెంట్స్, హీరోయిన్ గ్లామర్, హీరో ఎలివేషన్స్, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. మరోసారి దర్శకుడు శ్రీవాస్ తాను కమర్షియల్ చిత్రాలని డీల్ చేయడంలో సిద్దహస్తుడిని అని నిరూపించుకున్నారు.

'నేను హైవే లో డేంజర్ జోన్ బోర్డు లాంటోడిని.. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గకపోతే చావు వెతుక్కుంతూ వస్తుంది' అని గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. అలాగే ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ అని జగపతి బాబు చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
బిజియం కూడా పవర్ ఫుల్ గా ఉంది. డింపుల్ హయతి మరోసారి గ్లామర్ కి మాత్రమే పరిమితమైన రోల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి కామెడీతో సందడి చేస్తున్నారు. ఓవరాల్ గా రామబాణం ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.
