ధనుష్ కమిట్‌మెంట్: షూటింగ్‌లో తీవ్రగాయాలు.. షాట్ పూర్తి చేశాకే ఆసుపత్రికి...

hero dhanush injured in shooting
Highlights

ధనుష్ కమిట్‌మెంట్: షూటింగ్‌లో తీవ్రగాయాలు.. షాట్ పూర్తి చేశాకే ఆసుపత్రికి...

సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ స్టేటస్ అందుకోవడం అసాధ్యం.. ఒకవేళ వారి సపోర్ట్ ఉన్నా ఉపయోగించుకోకుండా కష్టపడి పైకి వచ్చే వారు కొందరుంటారు..అలాంటి వారిలో తమిళ హీరో ధనుష్ కూడా ఉంటాడు.. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైనప్పటికీ ఆ పేరును వాడుకోకుండా తనంతట తాను స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు ధనుష్. అతని కృషి, పట్టుదల, కసి ధనుష్‌ను ఆ స్థాయికి చేర్చింది. దానికి ఒక మచ్చు తునక ఈ ఘటన..

ప్రస్తుతం బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ మారి-2లో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఇవాళ క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ జరుగుతుండగా.. ధనుష్ కుడి కాలికి, ఎడమ కాలికి గాలయ్యాయి.. అయితే బాధను అదిమిపెట్టి షాట్ పూర్తయ్యాకే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాడు..

దీంతో ఈ స్టార్ హీరో పట్టుదల చూసి యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోయారట. ఆయన కోలుకునేదాకా షూటింగ్‌కు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. చిన్న గాయాలేనని.. కంగారు పడాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు తెలియజేశాడు ధనుష్.

loader