హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హైదరాబాద్‌లో హల్‌ చల్‌ చేశారు. రాంగ్‌ రూట్‌లో కారుని డ్రైవ్‌ చేయడమే కాదు, ఏకంగా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తోనూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.  

యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేశారు. రాంగ్‌ రూట్లో ఆయన రచ్చ చేయడం గమనార్హం. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ రాంగ్‌ రూట్‌లో కారు డ్రైవ్‌ చేశారు.

రాంగ్‌ రూట్‌లో రావడంతో ప్రశ్నించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పైకి ఆయన కారు దూసుకెళ్లడం గమనార్హం. కానిస్టేబుల్‌ హీరోని అడ్డుకుని రోడ్డుపైనే నిలదీశాడు. దీంతో చేసేదేం లేక సైలెంట్‌గా జారుకున్నారు శ్రీనివాస్‌. 

రాంగ్‌ రూట్‌లో వెళ్లి ట్రాఫిక్‌ పోలీస్‌కి బెల్లంకొండ శ్రీనివాస్‌ ఝలక్‌

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న హీరోని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నించారు, దీంతో రూట్‌ మార్చుకుని వెళ్లిపోతున్నట్టుగా ఉంది. అయితే ఇది హీరో కావాలనే చేశాడా? ఇందులో సినిమా స్టంట్‌ ఏదైనా ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ `భైరవం` అనే చిత్రంలో నటిస్తున్నారు.

Scroll to load tweet…

ఇందులో మంచు మనోజ్‌, నారా రోహిత్‌ లు మరో హీరోలు. ముగ్గురు కలిసి నటించిన ఈ చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్‌ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ `దమ్‌ దుమారే` పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ మే 30న విడుదల కాబోతుంది. 

బెల్లంకొండ, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ హీరోలుగా `భైరవం` మూవీ

సినిమాకి పెద్దగా బజ్‌ లేదు. ముగ్గురు హీరోలున్నా ఆడియెన్స్ కి రీచ్‌ కావడంలో వెనకబడుతుంది. ఈ క్రమంలో బెల్లంకొండ వీడియో హల్‌చల్‌ చేయడం విశేషం. ఇక యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ముగ్గురు హీరోల కెరీర్‌ డిపెండ్‌ అయి ఉంది.

ఇది హిట్‌ అయితే బెల్లంకొండ హీరోగా ఫామ్‌లోకి వస్తారు. ఆయనతోపాటు నారా రోహిత్‌ కూడా చాలా రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య చేసిన `ప్రతినిధి 2` తేడా కొట్టింది. మరో మూవీ వాయిదా పడుతూ వస్తుంది. 

`భైరవం` సక్సెస్‌పై ముగ్గురు హీరోల భవిష్యత్‌

ఇక మంచు మనోజ్‌కి హీరోగా సినిమాలు లేక చాలా కాలం అవుతుంది. ఆయన హీరోగా ప్రారంభం కావాల్సిన మూవీస్‌ ఆగిపోయాయి. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు విలన్‌గా మారారు. `మిరాయ్‌` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. దీంతోపాటు `బైరవం`లో కీలక పాత్రలో కనిపిస్తుంది.

ఈ మూవీస్‌ విజయాలు ఆయన కెరీర్‌ పుంజుకునేలా చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే `భైరవం` విజయం ఈ ముగ్గురు హీరోలకు చాలా ముఖ్యం కావడం విశేషం. మరి ఇది ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇందులో అదితి శంకర్‌, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు.