కెప్టెన్ సినిమా రాజా రాణీ అంత హిట్ అవుతుందన్న ఆర్య , ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్
ఆర్య హీరోగా నటించిన సినిమా కెప్టెన్. ఇండియాలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈసినిమా ఈ వారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రయోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చి హీరో ఆర్య మీడియాతో మాట్లాడారు. సినిమాగురించి వివరించారు.
ఆర్య హీరోగా నటించిన తాజా సినిమా కెప్టెన్. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు.
ఆర్య మాట్లాడుతూ... శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను 'టెడ్డీ' సినిమా చేశా. ఆ సినిమా తర్వాత 'కెప్టెన్' కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఆల్రెడీ శక్తితో పని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక... ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే... పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, మా సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది ప్రెడేటర్'లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బావుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అని హామీ ఇచ్చారు ఆర్య. వీఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్ వర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారు అన్నారు.
అంతే కాదు నటుడిగా తనకు ఇది ఛాలెంజింగ్ పాత్ర అన్నారు ఆర్య. క్లైమాక్స్ పార్ట్ షూట్ లో.. మీరు ఫస్ట్ లుక్స్ లో చూసి జీవి నటీనటుల ముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. అది ఛాలెంజింగ్ గా అనిపించిందన్నారు. ఇంకొక విషయం ఏంటంటే... భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవి షూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి పైకి రాలేను కదా! అందుకని, స్కూబా డైవింగ్ కుఉపయోగించే ఎక్విప్మెంట్ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను. అన్నారు ఆర్య.
అంతే కాదు ఈ సినిమా గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ఆర్య . కెప్టెన్'లో క్రియేచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడు శక్తికి వీఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి... నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్టు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు. అన్నారు ఇది ఇండియాలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ న్నారు ఆర్య.
ఆర్మీ సినిమా కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకున్నాం. అందుకని, కాస్ట్యూమ్ అన్నీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ కోసం యూనిఫామ్ కుట్టేవాళ్ళ దగ్గర కుట్టించాం. కలర్ నుంచి ఏ విషయంలో తప్పు జారగకూడదని చూశాం. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో ఉండేలా చూసుకున్నాం. గన్ పట్టుకోవడం నుంచి రన్నింగ్, ఉన్నత అధికారులకు సెల్యూట్ చేసే వరకూ ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నారు. అంతే కాదు టెడ్డీ' సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా....అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. 'కెప్టెన్' మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది అన్నారు ఆర్య.
ఇక ఈ సినమా తెలుగు రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు హీరో నితిన్ నాకు మంచి ఫ్రెండ్. కమల్ హాసన్ గారి విక్రమ్' తో భారీ హిట్ అందుకున్నారు. 'కెప్టెన్' ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను అన్నారు. నితిన్ ఈసినిమా తీసుకోవడం చాలా సంతోషం వేసిందన్నారు. ఇక అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు. తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాచేస్తానన్నారు. అంతే కాదు తెలుగులో డబ్ అయ్యిన సినిమాలలో రాజా రాణి మంచి సక్సెస్ అందుకుంది... ఇక కెప్టెన్' కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఇక తన నెక్ట్స్ సినిమాల గురించి కూడా మాట్లాడారు ఆర్య. సిద్ధార్థ్ 'గృహం' తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం 'విలేజ్' వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీ హీరోగా 'విరుమాన్' తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా అన్నారు ఆర్య. ఇక తన డ్రీమ్ రోల్ గురించి ప్రశ్నించగా.. నాకు డ్రీమ్ రోల్ ఏదీ లేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను అన్నారు.
మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు నటించిన కెప్టెన్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్, సౌండ్ డిజైన్ : అరుణ్ శీను, సౌండ్ మిక్స్ : తపస్య నాయక్, కలరిస్ట్ : శివ శంకర్ .వి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి, ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, మ్యూజిక్ : డి ఇమాన్, రచన - దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.