హీరో అర్జున్ తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తారని అందరూ అడుగుతున్న నేపథ్యంలో అర్జున్ ఇలా స్పందించారు. అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కిన చిత్రం పొగరు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ బాషలలో కూడా విడుదల చేయనున్నారు. మూవీ విడుదల నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశంలో అర్జున్ పాల్గొన్నారు. 

అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. అందరూ తనను పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారూ. నిజానికి రాజకీయాల పట్ల నాకు ఆసక్తిలేదు. పాలిటిక్స్ నాకు సరిపడవు. కాబట్టి నేను ఎప్పటికీ రాజకీయాలలోకి వచ్చేది లేదు. రాజకీయాలలో ఒకస్థాయికి వెళ్లాలంటే చాలా కష్టం. ఒకే ఒక్కడు సినిమాలో వలె రాజకీయాలలో రాణించడం అంత సులభం కాదు అని అన్నారు. 

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు మూవీలో అర్జున్ సీఎంగా నటించారు. తెలుగు, తమిళ భాషలలో ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని ఆ మూవీ అందుకుంది. ఇక అర్జున్ ఈ మధ్య విలన్ పాత్రలు చేస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కిన లై మూవీలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు.