Asianet News TeluguAsianet News Telugu

Jr NTR: ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్, తారక్ అన్న ఎలాంటోడంటే...?

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై స్పెషల్ పోస్ట్ పెట్టాడు మెగా హీరో అల్లు శిరీష్. తారక్ అన్నఎలాంటివాండంటే.. అంటూ.. యంగ్ హీరో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్అవుతోంది. 

Hero Allu Sirish Special Post To Global Star Jr NTR JMS
Author
First Published Nov 17, 2023, 11:25 AM IST

ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల దగ్గర నుంచిసెలబ్రేటిల వరకూ అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు తారక్ ను. ఎన్టీఆర్ తన అభిమానులతో..  తోటి నటీనటులతో ఎంత ప్రేమగా ఉంటారో  అందరికి తెలిసిందే. వారు చిన్నోరా..పెద్దోళ్లా అనే బేదం ఆయనకు ఉండదు. అందరితో ఇట్టే కలిసి పోతారు తారక్. అభిమానులతో అయినా సరే అంతే ప్రేమగా ఉంటారు. 

టాలీవుడ్ లో హీరోలందరితో ప్రేమగా ఉంటాడు ఎన్టీఆర్. అందరితో బ్రదర్ రిలేషన్ ను మెయింటేన్ చేస్తుంటాడు. ఇక ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీతో ఉండే అనుబంధం  ప్రత్యేకమైంది. మరీ ముఖ్యంగా  అల్లు అర్జున్ మధ్య ఉన్న బంధం గురించి అందరికి తెలిసిందే. ఒకరిని ఒకరు బావ అని పిలుచుకుంటూ...విష్ చేసుకుంటూ..  సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇక వీరి రెండు కుటుంబాధ మధ్య బంధం మరోసారి రుజువయ్యింది. 

 తాజాగా అల్లు శిరీష్, ఎన్టీఆర్ గురించి చేసిన ఓ  పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా  చిరంజీవి ఇంట్లో  దివాళీ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ కి ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. ఇక మెగా ఇంట వేడుకల్లో అల్లు ప్యామిలీ కూడా సందడి చేశారు. ఆ సెలబ్రేషన్ లో అల్లు శిరీష్ కూడా  హడావిడి చేశాడు.

ఇక ఆ పార్టీ అయిపోయిన తరువాత కొన్నిరోజులకు తాజాగా శిరీష్... ఎన్టీఆర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎవరు ఎప్పుడు తనతో ఒక ఫోటో అడిగినా తారక్ అన్న అందరితో ఒకేలా ఉంటారు. వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. చాలా ప్రేమ ఉన్న మనిషి అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పిక్ చూసిన ఫ్యాన్స్.. రకరకా కామెంట్లుపెడుతున్నారు.  

 

అయితే అల్లు శిరీష్ కు కొంత మంది ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో కూడా షేర్ చేయమని అడుగుతున్నారు.  ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దివాళీ తరువాత మొదలైన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు మూవీలోని పలు ప్రధాన పాత్రలు షూటింగ్ లో పాల్గొంటున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios