రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు... అప్పటి హీరో.. హ్యాండ్సమ్ స్టార్.. అబ్బాస్. సినిమాలు వదిలేసి విదేశాల్లో సెటిల్ అయిన అబ్బాస్.. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఓపెన్ అయ్యారు.  

తెలుగు, తమిళ హిందీ భాషల్లో వరుస సినిమాల చేసి ఆడియన్సను మెప్పించారు అబ్బాస్.అప్పట్లో హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల కలల రాజకుమారుడు అనిపించుకున్నాడు అబ్బాస్. ఎందుకో ఏమో.. తెలియదు కాని..కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యారు అబ్బాస్. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించాడు అబ్బాస్. అయితే ఇప్పుడు అబ్బాస్ ఎలా ఉన్నారు అని చాలా మంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.

ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి కలర్ పర్సనాలిటీతో అమ్మాయిలు చూడగానే మనసు దోచుకునేలా ఉంటాడు హీరో. అందుకే లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు అబ్బాస్. హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. 2015 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ రావడానికి ట్రై చేస్తున్నారు అబ్బాస్.

అయితే అబ్బాస్ ఓ టాయిలెట్ క్లీనర్ యాడ్ లో నటించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యనికి గురి చేసింది. ఈ విషయంలోఆయన పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న అబ్బస్ ఇలా టాయిలెట్ క్లినర్ లిక్విడ్ కు సంబంధించిన యాడ్ లో నటించడంతో ఆయనను చాలా మంది విమర్శించారు. అయితే తాజాగా దీని పై స్పందించారు అబ్బాస్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ యాడ్ పై నటించడం గురించి మాట్లాడారు.

టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్‌ చేశారు. నేను దాన్ని వాడమని చెప్పను అంతే కానీ తాగమని చెప్పలేదు అని అన్నారు. అలాగే నా పై చాలా మంది మీమ్స్ కూడా చేశారు. నా వీడియో ను వాడుకొని నా పై ట్రోల్ చేశారు. రకరకాల వీడియోలు చేశారు. కానీ నేను దాని పై ఎప్పుడు బాధపడలేదు అన్నారు అబ్బాస్. అంతే కాదు పరిశుభ్రత మీద అవగాహన కల్పించాలన్న ఆలోచనతో ఆ యాడ్ చేశాను. అంతే కాదు ఆ సమయంలో నేను బిజీగా లేను. అందులో నటించినందుకు నాకు మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఆయాడ్ తో నాకు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ ఉంది. ఆ డబ్బులతోనే నేను నా కుటుంబాన్ని పోషించా అన్నారు. 

అంతే కాదు నేను అన్ని వృత్తులను ఒకేలా చూస్తాను... చిన్న పని, పెద్ద పని అని బేధాలు కాని తేడాలు కాని నాకు లేవు అన్నారు అబ్బాస్. సినిమాలు మానేసిన తరువాత న్యూజిలాండ్‌ వెళ్ళిపోయారు అబ్బాస్. చాలా కాల అక్కడే ఉన్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించారు. ఈమధ్యే తిరిగి ఇండియాకు తిరిగి వచ్చిన ఆయయన . తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.