ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రకటించారు. లాక్ డౌన్ కి ముందే పూరి... విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముంబైలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. లాక్ డౌన్ తరువాత అన్ని చిత్రాల మాదిరి పూరి- విజయ్ మూవీ షూటింగ్ కూడా హోల్డ్ లో పడింది. 

లాక్ డౌన్ సడలింపుల తరువాత మరలా ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ పదో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కీలక అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. జనవరి 18న ఉదయం 10:08 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనితో పూరి జగన్నాధ్ అండ్ విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

చాలా కాలంగా ఈ చిత్ర టైటిల్ గా ఫైటర్ ప్రచారంలో ఉంది. అయితే చిత్ర యూనిట్ విషయాన్ని ఖండించారు. ఈ మూవీ కోసం సరికొత్త టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్నమైన టైటిల్స్ కి డైరెక్టర్ పూరి ప్రసిద్ధి కాగా, విజయ్ కోసం ఎలాంటి టైటిల్ సిద్ధం చేశాడో చూడాలి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని పూరి కనెక్ట్స్  మరియు ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా... మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.