కరోనా కారణంగా ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమించిందన్న వార్త దేశంలోని అన్ని చిత్రవర్గాలను, ఆయన అభిమానులను కలచివేసింది. బాలసుబ్రమణ్యం గారిని సాధారణ గదిని నుండి ఐ సి యూ కి షిఫ్ట్ చేశారన్న వార్త విని అందరూ కంగారుకు లోనయ్యారు. బాలసుబ్రమణ్యం గారికి ఏమవుతుందో అని సోషల్ మీడియాలో ఆయన కొరకు ప్రార్ధనలు వెల్లువెత్తాయి. బాలసుబ్రమణ్యం స్నేహితులు అయిన ఇళయరాజా, భారతీరాజా ఆయన త్వరగా కోలుకొని తిరిగిరావాలని, దానికోసం అందరూ ప్రార్ధనలు చేయాలని అభ్యర్ధించారు.

ముఖ్యంగా ఇళయరాజా ఓ భావోద్వేగ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. కాగా ఎస్పీ బాలు ఆరోగ్యపరిస్థితిపై ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పడం జరిగింది. ఐతే బాలుగారిని ఐ సి యూ లో లైఫ్ సప్పొరింగ్ సిస్టంపైనే ఉంచారు. డాక్టర్స్ ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజా ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ మరియు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకడం అనేది అందరినీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. చిత్ర పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో బండ్ల గణేష్ తో మొదలైన కరోనా అనేక మందికి సోకింది. దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.