సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది కంగనా రనౌత్(Kangana Ranauth). ఇక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో తన సత్తా చూపించేందుకు సిద్ధమైంది. కంగనా హోస్ట్ గా ఓ సరికొత్త రియాలిటీ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. లాక్ అప్ పేరుతో స్ట్రీమ్ కానున్న ఈ షో ట్రైలర్ విడుదల చేశారు.
లాక్ అప్ రియాలిటీ షో ట్రైలర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది కంగనా రనౌత్. ఇక కంటెస్టెంట్స్ చేతులకు బేడీలతో.. జైలు గదుల్లో ఉన్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ... అన్నపానీయాలు, స్నానాదికాలు అక్కడే. ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. ఈ షో బిగ్ బాస్ కి మించిన కాంట్రవర్సీ, ఫైట్, రొమాన్స్ తో కూడి ఉంటుందని. డిజిటల్ కంటెంట్ నేపథ్యంలో పరిమితులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అడ్వెంచర్, మసాలా కంటెంట్ తో కూడిన లాక్ అప్ షో ప్రోమో అంచనాలు పెంచేసింది.
నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపిన కంగనా లాక్ అప్ (Lock Upp) రియాలిటీ షోని హోస్ట్ గా నడపనున్నారు. లాక్ అప్ షో ఫిబ్రవరి 27నుండి ఏ ఎల్ టి బాలాజీ, ఎం ఎక్స్ ప్లేయర్ లో ఈ షో ప్రసారం కానుంది.
డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో స్టార్స్ నయా ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలు, టాక్ షోల ట్రెండ్ ఊపందుకుంది. నటసింహం బాలయ్య (Balakrishna)అన్ స్టాపబుల్ షో అన్ బిలీవబుల్ సక్సెస్ అందుకుంది. నిజంగానే బాలయ్య అందరి థింకింగ్ మార్చేశాడు. వరల్డ్ రికార్డులు నెలకొల్పిన అన్ స్టాపబుల్ షో ఓ సంచలనం అని చెప్పాలి. ఆయన స్పూర్తితో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ రియాలిటీ షోకి సిద్ధమయ్యారు.
ఇక కంగనా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో ఈ మూవీ విడుదలైంది. ప్రస్తుతం ధాకడ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అలాగే తేజాస్ అనే మరో మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. నిర్మాతగా కూడా మారిన కంగనా టికు వెడ్స్ షేరు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
