ఇప్పుడు మాట్లాడుకోవటానికి  ‘వకీల్ సాబ్’ గురించి తప్ప వేరే మ్యాటర్ ఉందా సినీ జనాలకి. బోలెడు ఎక్సపెక్టేషన్స్ తో వస్తున్న ఈ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కు ఆల్రెడీ అడ్వాన్స్ బుక్కింగ్ మొదలైపోయింది. హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడైపోతున్నాయి. కరోనా భయం కూడా ఎక్కడా ఈ హవా ముందు కనపడటం లేదు. ఈ క్రమంలో వకీల్ సాబ్ లో వచ్చే సర్పైజ్ లు, హైలెట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సర్పైజ్ అంటే..పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అని చెప్తున్నారు. ఓ పెద్ద ఫైట్ తో ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుందని, చాలా కూల్ గా పవన్ రివీల్ అయ్యి చేసే ఫైట్ కు గూస్‌ బంప్స్‌ వస్తాయంటున్నారు. రొటీన్ ఇంట్రడక్షన్ సీన్ అయినా రెట్రో పవన్ కళ్యాణ్ ని చూస్తారని చెప్పుకుంటున్నారు.

అలాగే ఈ సినిమాలో మరో హైలెట్  క్లైమాక్స్. మొత్తం ఇరవై నిముషాలు పాటు క్లైమాక్స్ సాగుతుందిట. ఈ ఎపిసోడే సినిమాని పీక్స్ కు తీసుకువెళ్తుంది అని అంటున్నారు.  ప్రీ క్లైమాక్స్ లో మొదలయ్యే హంగామా, ఎండ్ టైటిల్స్ దాకా నాన్ స్టాప్ గా సాగుతుందని,  ఇది వర్కవుట్ అయితే బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. అలాగే పింక్ సినిమా క్లైమాక్స్ కు, దీనికి కొద్దిపాటి తేడా ఉంటుందని యాజటీజ్ ఫాలో అవ్వలేదని, కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్లూ విజిల్స్ వేసే స్దాయిలో ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేసారట. ఈ క్లైమాక్స్ చూసి బయిటకు వచ్చే ప్రేక్షకుడు ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేడట. ఆ స్దాయిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఓ రేంజిలో ఎక్కేస్తుందిట.  

అలాగే ఒరిజనల్ ,అజిత్ తమిళ వెర్షన్ లో లేని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సైతం సినిమాలో ఉంటుందిట. ఆ ఇంప్రవైజేషన్ నచ్చే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారట. వకీల్ సాబ్ క్యారక్టరైజేషన్ ని డిఫైన్ చేసే విధంగా ఆ ప్లాష్ బ్యాక్ ఉంటుందని, చాలా రోజులు పాటు దానిపైనే టీమ్ కసరత్తు చేసిందని అంటున్నారు. అలా మొత్తం సెకండాఫ్ ని ప్యాకేజ్ గా మన ముందుంచబోతున్నారట. ఈ తెలుగు వెర్షన్ చూసి ఒరిజనల్ హిందీ పింక్, తమిళ వెర్షన్ డైరక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది రేపు మార్నింగ్ కు తెలిసిపోతుంది. అప్పటి దాకా ఇలా ముచ్చట్లు చెప్పుకోవటమే.