తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 షో వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త తమపై బిగ్ బాస్ కో ఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయడంతో కలకలం మొదలయింది. దీనితో బిగ్ బాస్ షో నిర్వహించకూడదనే విమర్శలు ఎదురవుతున్న తరుణంలో నటి హేమ స్పందించింది. 

ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు బిగ్ బాస్ షోని ఆపలేవని హేమ తెలిపింది. బిగ్ బాస్ లాంటి పెద్ద షో నిర్వహిస్తునప్పుడు ఇలాంటి చిన్న వివాదాలు సాధారణమే అని హేమ తెలిపింది. బిగ్ బాస్ లో నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఉంటే నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ గా ఎందుకు చేస్తారు అని హేమ ప్రశ్నించారు. 

శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త ఆరోపణలు గురించి హేమ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కో ఆర్టినేటర్లు తప్పుగా మాట్లాడి ఉంటే అప్పుడే నిలదీసి ఉండాలి. కానీ ఎంపిక జరిగిపోయాక అవకాశం రాలేదని ఇలా నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని హేమ ప్రశ్నించారు. 

సెలెక్షన్స్ జరిగిన నెలరోజుల తర్వాత స్పందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడే చొక్కా పట్టుకుని నిలదీస్తా అని హేమ అన్నారు. ఇక బిగ్ బాస్ 3లో పాల్గొనే విషయం గురించి మాట్లాడుతూ.. అవకాశం ఉంటే బిగ్ బాస్ షోలో పాల్గొంటానని హేమ తెలిపింది.