కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 తొలి వారం ముగిసింది. ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున తొలి ఎలిమినేషన్ ని ప్రకటించాడు. తొలి వారంలో ఎలిమినేషన్ కొరకు జాఫర్, హేమ, హిమజ, పునర్నవి, రాహుల్, వితిక నామినేట్ అయ్యారు. శనివారం రోజు హిమజ, పునర్నవి సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. 

కాగా ఆదివారం రోజు చివరి వరకు ఉత్కంఠకు గురిచేసిన నాగార్జున.. హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు. దీనితో జాఫర్, వితిక, రాహుల్ సేఫ్ అయ్యారు. నాగార్జున కాసేపు వితికని ఉత్కంఠకు గురిచేశారు. చివరి ముగ్గురిలో వితిక సేఫ్ అవుతున్నట్లు ప్రకటించడంతో ఆమె సంతోషంలో ఒక్కసారిగా తన భర్త వరుణ్ కు ముద్దిచ్చింది. 

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం 1 కోటి 30 లక్షల ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించాడు. ఆడియన్స్ లో ఎక్కువగా హేమపై వ్యతిరేకత ఉన్నట్లు నాగార్జున తెలిపాడు. హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించడానికి ముందు నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి కొన్ని స్లిప్స్ఇచ్చి హౌస్ లో గుడ్ ఎవరు.. యావరేజ్ ఎవరు.. బ్యాడ్ ఎవరో రాయాలని అడిగాడు. అందులో కూడా ఎక్కువ మంది హేమనే బ్యాడ్ అని రాసినట్లు నాగ్ తెలిపాడు. 

హేమపై ఆడియన్స్ లోనే కాక హౌస్ లో కూడా వ్యతిరేకత ఉంది. ఎలిమినేట్ అయినా హేమ ఇంటి సభ్యులతో సెల్ఫీ తీసుకుని బయటకు వచ్చేసింది. హౌస్ లో ఎక్కువ మంది బాబా భాస్కర్ గుడ్ అని పేర్కొన్నారు. జాఫర్ యావరేజ్ అని నాగార్జున పెట్టిన టాస్క్ ద్వారా తీర్పు ఇచ్చారు.