వరుసబెట్టి అడల్ట్ కంటెంట్ సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ‘నగ్నం’ సినిమా ద్వారా శ్రీ రాపాక (స్వీటీ)ని, ఆమె అందాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్ ని మరింతగా లేపే క్రమంలో శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక సెన్సేషనల్ విషయాలు రివీల్ చేసింది. హాట్ కామెంట్స్ చేసింది.  ఇంటర్వ్యూలలో అనేక రకాల విషయాలపై స్పందిస్తోంది. 
 
అసలు ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె యాభైకి పైగా సినిమాలకు పనిచేసింది అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో హేమతో జరిగిన గొడవ.. విషయం రివీల్ చేసింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమతో కూడా గొడవ అయ్యిందనే విషయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆ గొడవ విషయం యాక్టర్ మోహన్ బాబు వరకు వెళ్లిందట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది శ్రీ. తను ఎవరికి భయపడే రకం కాదని నిర్మొహమాటంగా జరిగిన విషయాన్ని బయటపెట్టింది.

ఇంతకీ గొడవకు కారణం ఏమిటి అంటే...మంచు మనోజ్ దూసుకెళ్తా సినిమాకు శ్రీ రాపాక కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. నటి హేమ గారు పిలిచే విధానం నాకు నచ్చలేదు. ఒక కాస్ట్యూమ్ సెట్ చేస్తున్న సమయంలో ఏమే.. అంది. నాకు ఎవరైనా సరే ఏయ్..ఏమే..అంటే అస్సలు నచ్చదు. సడన్ గా హేమ గారు అలా అనడంతో ఇంకోసారి అలా అనవద్దని సీరియస్ గా చెప్పాను. 

ఆమె కాస్త కోపంతో జరిగిన విషయాన్ని మోహన్ బాబు గారికి చెప్పింది. ఆ తరువాత ఆయన పిలిచారు కూడా. తనకు అలా పిలిస్తే నచ్చదు అని చెప్పడంతో ఆయన కూడా పెద్దగా ఏమి అనలేదు అని శ్రీ రాపాక తెలియజేశారు. ఆ తరువాత హీరో మంచు విష్ణు, దర్శకుడు వీరుపోట్ల కూడా ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోవద్దని తనకు చెప్పారని శ్రీ తెలియజేసింది.