Asianet News TeluguAsianet News Telugu

'హలో గురు ప్రేమకోసమే' సెన్సార్ రిపోర్ట్!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దర్శకుడు త్రినాధరావు నక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు

hello guru premakosame movie censor report
Author
Hyderabad, First Published Oct 15, 2018, 4:47 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దర్శకుడు త్రినాధరావు నక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఊహించని విధంగా ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగ్స్, ప్రకాష్ రాజ్.. రామ్ ల మధ్య జరిగే సంభాషణలు సినిమాపై హైప్ ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు.

దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. 

ఇది కూడా చదవండి..

ఛీ.. అవతలకి పో.. ప్రకాష్ రాజ్ ని తిట్టిన హీరో రామ్!
 

Follow Us:
Download App:
  • android
  • ios