కుమారి 21 ఎఫ్ తో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయమైన హెబ్బా పటేల్.. ఈ సినిమాతో స్టార్ నైట్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించగా.. అంత సక్సెస్ అందుకోలేదనే చెప్పవచ్చు.
కుమారి 21 ఎఫ్ తో పరిశ్రమకు పరిచయమైన హెబ్బా పటేల్.... తొలి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాణి అయ్యిపోయింది. ఆ సినిమాతోన యూత్ కు కావాల్సిన కిక్ ఇవ్వటంతో ఫుల్ బిజీ అయ్యిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెకు వచ్చాయి. అలాగే కొన్ని విజయాలు లు కూడా అమ్మడి ఖాతాలో పడ్డాయి. కానీ, స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం అమ్మడికి రాకపోయే సరికి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.ఈ మధ్యన తన స్దాయి హీరోల సినిమాలు కూదా దక్కకపోవటంతో డల్ అయ్యిపోయింది. దాంతో తప్పు ఎక్కడ ఉందా అని ఆలోచనలో పడింది. ఆ విషయాలను మీడియాతో పంచుకుంది.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ...“నేను ఇండస్ట్రీలోకి ప్రవేసించేనాటికి ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు పూర్తిగా కొత్త. ఏం చేయాలి..ఏం చేయకూడదు అనే సంగతి అసలు తెలియదు. దాంతో నా దగ్గరకు వచ్చిన ప్రతీ ఆఫర్ కు ఓకే చెప్పేసాను. దాంతో నన్ను చాలా మంది టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. నా వెనక నా గురించి మాట్లాడుకోవటం విన్నాను. ఇప్పుడిప్పుడే అర్దమవుతోంది. నేను ఇన్నాళ్లకు మారాను. నేను ఇప్పుడు కథ, నా పాత్ర వంటి క్రియేటివ్ సంతృప్తి ఉంటేనే ఒప్పుకోదలిచాను ,” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టేట్మెంట్ విన్నవాళ్లు ఇప్పుడు కెరీర్ అంతా పోయాక ఈ నిర్ణయం తీసుకుంటే కలసొచ్చేదేముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇండస్ట్రీలో మలయాళ భామల హవా మొదలుకావడంతో హెబ్బాను చూడటం మానేశారు దర్శకనిర్మాతలు. దాంతో చేసేది లేక ఐటెం సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేస్తున్నది. ఇటీవల భీష్మ లో హెబ్బా రెండు సన్నివేశాల్లో గెస్ట్ రోల్ లో చేసింది. ఇక రాజ్ తరుణ్ అప్ కమింగ్ ఒరేయ్ బుజ్జిగా లో కూడా గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ ప్లే చేసింది. ఈ సినిమా విడుదల అయినా కలిసి రాలేదు. అలాగే రామ్ నటిస్తున్న రెడ్ సినిమాలో హెబ్బా ఓ ఐటెం సాంగ్ చేసింది. అందాల విందుతో ఆకట్టుకునేలా సాంగ్ లో చిందేసినా ఫలితం లేదు. వరుసగా వెబ్ సిరీస్ లలో నటించినా ఫలితం లేదు.
