సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే నార్త్ అమ్మాయిలు తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా అవకాశాను అందుకుంటూ ఉంటారు. మినిమమ్ యావరేజ్ హిట్టవుతుంది అనుకున్నా కూడా వెంటనే ఒప్పేసుకుంటారు. ఒక్క సినిమా గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెస్తే చాలు వరుసగా అవకాశాలు వస్తుంటాయి. 

అసలు విషయంలోకి వస్తే కుమారి 21F ద్వారా ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న హెబ్బా పటేల్ ఆ తరువాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు. అయితే అవకాశాలు బాగానే వచ్చాయి. ఇకపోతే రీసెంట్ గా 24 కిస్సెస్ తో మళ్ళీ అందరిని ఆకర్షించిన అమ్మడు గ్లామర్ గర్ల్ గా క్లిక్ అవ్వాలని అనుకుంది. అయితే సినిమాలో కిస్సులు తప్ప కంటెంట్ లేకపోవడంతో నెగిటివ్ టాక్ వచ్చేసింది. 

ఈ సినిమా మీద నమ్మకంతో అమ్మడు ఇంతకుముందు వచ్చిన కొన్ని చిన్న ప్రాజెక్టులను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిందని టాక్. రెమ్యునరేషన్ కూడా పెంచలని అనుకుందట. అయితే సినిమా డిజాస్టర్ అని తేలడంతో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సినిమాలు కూడా క్యాన్సిల్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలో చేసిన ఏంజెల్ - నేను నాన్న నా  బాయ్ ఫ్రెండ్స్ సినిమాలు కొంత హైప్ క్రియేట్ చేసి రిలీజ్ తరువాత బోల్తా పడ్డాయి. మరి భవిష్యత్తులో అయినా అమ్మడు మంచి అవకాశాలను అందుకుంటుందో లేదో చూడాలి.