Asianet News TeluguAsianet News Telugu

24 ముద్దులే కాదు.. మంచి మ్యాటర్ కూడా ఉంది!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కూడా రొమాంటిక్ డోస్ తెగ పెంచేస్తున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమా వారు రిలీజ్ చేస్తోన్న పోస్టర్స్ అండ్ టీజర్స్ కుర్రకారును తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక మరోసారి రొమాంటిక్ టచ్ లో వస్తోన్న చిత్రం 24 కిస్సెస్. 

hebba patel about 24 kisses movie
Author
Hyderabad, First Published Nov 19, 2018, 6:30 PM IST

పోస్టర్ ద్వారానే హీటేక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కుమారి 21F బ్యూటీ హెబ్బా పటేల్ నటించింది. అమ్మడు సినిమాలో కిస్ సీన్స్ లో చాలా ఘాటుగా నటించిందని టాక్ కూడా వైరల్ అయ్యింది. ఇకపోతే సినిమాను మిణుగురులు లాంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అయోధ్య కుమార్ డైరెక్ట్ చేయడంతో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. 

దీంతో వస్తోన్న విమర్శలకు హెబ్బా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. కథలో భాగంగానే సినిమాలో ముద్దు సీన్స్ ఉన్నాయని కావాలని ఇరికించలేదని సమాధానం చెప్పింది. ఇక కిస్ సీన్స్ ట్రెండ్ నడుస్తోంది కావున అందుకే నువ్వు కూడా ఈ సినిమాను ఒప్పుకున్నావా అని చాలా మంది అడిగారని ఆర్ఎక్స్100 - అర్జున్ రెడ్డి సినిమాలకు ముందు ఈ కథ నా వద్దకు వచ్చినా చేసేదాన్ని అని వివరణ ఇచ్చింది. 

అదే విధంగా 24 కిస్సెస్ అనే టైటిల్ ను చూసి ఒక ఆలోచనకు ఫిక్స్ అవుతున్నారు. కానీ సినిమా మొత్తం చూసిన తరువాత తప్పకుండా సర్ ప్రైజ్ అవుతారు. కేవలం ముద్దు సీన్స్ అని కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇచ్చామని సినిమాలో మంచి మ్యాటర్ ఉందని హెబ్బా వివరణ ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios