ఒక్కసారి ఓ రకమైన ఇమేజ్ వచ్చిందంటే పొరపాటున కూడా దాన్ని నుంచి ఇండస్ట్రీ బయిటపడతానంటే ఒప్పుకోదు. అలాంటి పాత్రలే ఇచ్చి విసిగిస్తుంది. కొత్తగా ట్రై చేస్తానన్నా ఒప్పుకోదు. ఇప్పుడు హెబ్బా పటేల్ పరిస్దితి అదే. ఓ ప్రక్క చేతిలో హిట్ లేదు. వచ్చే ఒకటీ ఆరా పాత్రలు అన్ని హాట్ రోల్స్. గ్లామర్, ఎక్సపోజింగ్ తో కూడినవే. ఇప్పుడు నితిన్ తాజా చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదట. 

రాజ్‌త‌రుణ్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మించిన `కుమారి 21ఎఫ్‌` సినిమాతో  తెలుగు కుర్రాళ్ల గుండెల్లో తిష్టవేసుకుంది హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌. ఆ సినిమా సూపర్ హిట్ అటంతో ఆ వెంట‌నే చాలా ఆఫర్స్ హెబ్బాను వెతుక్కుంటూ వ‌చ్చాయి. అయితే వాటిల్లో కలిసొచ్చిందేమీ లేదు. అయితే చివరగా హెబ్బా  న‌టించిన మ‌రో బోల్డ్ మూవీ `24 కిసెస్‌`  చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అదీ నీరు కార్చేసింది. ఈ నేపధ్యంలో ఆమెకు నితిన్ సినిమాలో  అదిరిపోయే ఆఫర్ వచ్చిందని సమాచారం. స్క్రీన్ పై కనపడేది కొద్ది సేపైనా చాలా కాలం గుర్తిండిపోయే పాత్ర అవుతుందని వినికిడి.  ఆ సినిమా మరేదో కాదు భీష్మ. 

ఫిల్మ్ సర్కిల్స్ లో  చెప్పుకునేదాన్ని బట్టి  ఈ  చిత్రంలో కొన్ని సీన్స్ లో హెబ్బా, రష్మికల నడుమ హీరో నితిన్ నలిగిపోతాడని అంటున్నారు.  అలాగే  ఆమెతో  ఓ సాంగ్ సైతం ఉందని, అది చాలా హాట్ గా ఉంటుందని చెప్తున్నారు. అయితే అసలే తన కెరీర్ అస్తవస్తంగా సమయంలో మళ్లీ హాట్ రోల్ తో కనపడటం కాస్త ఇబ్బందే అయినా, నితిన్ వంటి స్టార్ సినిమాలో నటిస్తే మళ్లీ కెరీర్ పుంజుకునే అవకాసం ఉందని ఒప్పుకుందిట.  మరో ప్రక్క ఓ థ్రిల్లర్ సినిమాలోనూ హెబ్బా పటేల్ ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం బుల్లితెర మీద మంచి ఆద‌ర‌ణ పొందుతున్న `బిగ్‌బాస్‌-2` షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే హెబ్బ బిగ్‌బాస్ ఇంటిలోకి ప్ర‌వేశించ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.   వాటిలో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.