యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుమారి 21ఎఫ్ చిత్రంతో హెబ్బా యువతని ఫిదా చేసింది. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో కూడా హెబ్బా అందాలు ఆరబోసింది. రొమాంటిక్ రోల్స్ చేస్తూ యువ హీరోల సరసన నటించింది హెబ్బా. 

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షో కౌశల్ కు తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అతడి కోసం కౌశల్ ఆర్మీని కూడా అభిమానులు ఏర్పాటు చేశారు. ఇటీవల కౌశల్ హీరోయిన్ హెబ్బా పటేల్ తో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కౌశల్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం తాను హెబ్బా పటేల్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ ఫొటోలో హెబ్బా పటేల్ చీర ధరించి హోమ్లీ లుక్ లో కనిపిస్తోంది. 

హెబ్బా పటేల్ చివరగా నటించిన 24 కిస్సెస్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మకు ఎదురుచూపులు తప్పడం లేదు.