మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య బంధం అధికారికంగా విడాకులతో ముగిసింది. కొంత కాలంగా నిహారిక, చైతన్య జంటగా కనిపించడం లేదు. పైగా ఒకరి ఫోటోలని ఒకరు సోషల్ మీడియాలో డిలీట్ చేసుకున్నారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య బంధం అధికారికంగా విడాకులతో ముగిసింది. కొంత కాలంగా నిహారిక, చైతన్య జంటగా కనిపించడం లేదు. పైగా ఒకరి ఫోటోలని ఒకరు సోషల్ మీడియాలో డిలీట్ చేసుకున్నారు. దీనితో అప్పటి నుంచి అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. నిహారిక, చైతన్య విడిపోతున్నారంటూ రూమర్స్ కూడా వినిపించాయి.
కానీ దీనిపై మెగా ఫ్యామిలీ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేయడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇద్దరూ మ్యూచవల్ గా విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక, చైతన్య ఇద్దరిలో ఎవరు ముందుగా డివోర్స్ కోరుకున్నారు అనే చర్చ జరుగుతోంది.

వీరిద్దరూ కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం.. ముందుగా చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక విడాకుల వ్యవహారం అభిమానులకు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే నిహారిక తరుపున ఫిటిషన్ వేసిన లాయర్ గురించి కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
నిహారిక తరుపున పిటిషన్ వేసిన లాయర్ ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్ కి అభిమానిగా, జనసేన మద్దతు దారుడిగా ఉన్న కళ్యాణ్ దిలీప్ సుంకర. పిటిషన్ లో అతడి పేరు ఉంది. కళ్యాణ్ దిలీప్ సుంకర నాగబాబుకు చాలా సన్నిహితంగా ఉంటారు.

అయితే నిహారిక, చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు మనస్పర్థలకు కారణం ఏంటి అనే ప్రశ్నలపై చర్చ జరుగుతున్నప్పటికీ.. ఈ విషయాలని మెగా ఫ్యామిలీ గోప్యంగా ఉంచింది. నిహారిక నటిగా రాణిస్తుండగా.. చైతన్య వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. 2020లో వివాహంతో మొదలైన వీరి బంధం ఎక్కువరోజులు నిలబడలేదు.
