బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందులోని ఓ సీన్ వివాదానికి దారి తీసింది. ట్రైలర్ లో హీరో ఒక గుడి లోపలి వెళ్తూ షూస్ వేసుకొని ఉంటాడు.
కొన్ని వివాదాలు సినిమాలకు ప్లస్ అయ్యితే మరికొన్ని మైనస్ అవుతాయి. అందుకే దర్శక,నిర్మాతలు,, హీరో,హీరోయిన్స్ ఆచి,తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమాలో సన్నివేశాలు సైతం ఏ వర్గానికి కించరచకుండా చూసుకోవాల్సిన అవసరం సైతం ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఏదన్నా తేడా కామెంట్స్ సెలబ్రెటీల నుంచి వస్తే ...సినిమా బ్యాన్ చెయ్యాల్సిందే అని పట్టుబడుతున్నారు నెట్ జన్స్. ఇప్పుడు అలాంటి సమస్యే బాలీవుడ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర కు చుట్టుకోబోతోందా అనే సందేహం వెళ్లబుచ్చుతోంది బాలీవుడ్.
బాలీవుడ్ భారీ బడ్జెట్ తో మూడు పార్టులుగా బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కుతుంది. రణబీర్, అలియా జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది సినిమా. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ కు టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.
ఇక ఇటీవలే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందులోని ఓ సీన్ వివాదానికి దారి తీసింది. ట్రైలర్ లో హీరో ఒక గుడి లోపలి వెళ్తూ షూస్ వేసుకొని ఉంటాడు, అలాగే షూస్ వేసుకొని గంట కొడతాడు. దీంతో షూస్ తో గుడిలోకి ఎవరైనా వెళ్తారా అంటూ సినిమాపై వ్యతిరేకత వచ్చింది. సినిమాని, రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు.

అయాన్ ముఖర్జీ తన పోస్ట్ లో.. ”ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని వెళ్ళింది ఆలయంలోకి కాదు, దుర్గాదేవి పూజామండపంలోకి. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గాదేవి పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం బట్టి మేము మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం చెప్పులు తీసేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగిందిదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమా తీశాం. అంతే కానీ ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు” అని తెలిపాడు. మరి ఈ వివరణతో వివాదం పెరుగుతుందా... సద్దుమణుగుతుందా వేచి చూడాలి.
