టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను సెలబ్రెటీలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సవాల్‌ను స్వీకరించిన ప్రతి ఒక్కరు జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో వుంచుతున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ బార్బీగార్ల్ కత్రినా కైఫ్ తన జిమ్ పార్ట్‌నర్‌ ఎవరో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. వీరిద్దరూ సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రయినర్ యాస్మిన్ కరాచీవాలా బాడీ ఇమేజ్ సెంటర్‌లో వర్కవుట్లు చేస్తున్నారు.. జిమ్‌లో జరిగిన ఒక ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ కనిపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్దినిమిషాల్లోనే 1,11,846 మంది దానిని వీక్షించారు.