బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన భార్యతో విడిపోయిన తరువాత స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ విషయం శ్రద్ధా తండ్రి శక్తికపూర్ కి నచ్చక ఆయన గొడవ పెట్టుకున్నాడని ఇలా రకరకాలా ఊహాగానాలు వినిపించాయి.

ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే ఈ దర్శకుడు ఇప్పుడు శ్రద్ధాకి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఫర్హాన్.. శ్రద్ధాని వదిలేసి మరో భామతో తిరుగుతున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

శివానీ దండేకర్ అనే వీజే, టీవీ హోస్ట్ తో ఫర్హాన్ ప్రేమాయణం సాగిస్తున్నాడు.ఈ విషయాన్ని ఈ జంట పరోక్షంగా అంగీకరించింది. కొన్ని రోజుల క్రితం శివానీ.. ఫర్హాన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలానే ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి బయటతిరగడం మీడియా కెమెరాలకు చిక్కింది.

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో సెటిల్ అయిన ఫర్హాన్, శ్రద్ధాని వదిలేశాడని టాక్. ఇక్కడితో శ్రద్ధా, ఫర్హాన్ ల మధ్య రూమర్లకు చెక్ పడినట్లే.. ప్రస్తుతం శ్రద్ధా హీరోయిన్ గా 'సాహో' సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.