Asianet News TeluguAsianet News Telugu

నవీన్ ఆగిన సినిమా మొదలవుతుందా, శ్రీలీల సంగతి ఏంటో?

 ధ‌మాకా కంటే ముందు శ్రీలీల అంగీక‌రించిన సినిమా ఇది. ఆమె కెరీర్‌లో అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఆగిపోయిన ఫ‌స్ట్ మూవీగా అన‌గాన‌గా ఒక రాజు నిలిచింది. ఏదైతేనేం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదిలిక వస్తుందా అనేది చూడాల్సి ఉంది. 

Has Naveen Polishetty and Sreeleela Anaganaga Oka Raju restart? jsp
Author
First Published Sep 23, 2023, 8:03 AM IST


 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఈ మూడు చిత్రాలతో నవీన్‌ పొలిశెట్టి హ్యాట్రిక్ పూర్తయింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఈ సినిమాలు పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడి సక్సెస్ అయినవే.  జాతిరత్నాలు వంటి పెద్ద హిట్ తర్వాత నవీన్‌ కంగారుపడలేదు. ఆచితూచి అడుగులు వేసాడు. జాతి రత్నాలు టైమ్‌లోనే రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి  రిలీజై సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ఆ రెండో చిత్రం రెండేళ్ల కిందట ప్రకటించిన అనగనగా ఒక రాజు సినిమా విషయం మాత్రం తేలలేదు. అప్పట్లో ఈ  సినిమాకు సంభందించి టైటిల్‌ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. దానికి మంటి రెస్పాన్స్ కూడా వచ్చింది. 

అయితే ఇప్పుడు మిస్టర్ పొలిశెట్టి హిట్ తో ఈ సినిమాని బయిటకు తీస్తారా అనే టాక్ మొదలైంది. అదే సితార బ్యానర్ లో నవీన్ కు అడ్వాన్స్ ఉంది ఇప్పుడు ఓ ప్రాజెక్టు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అయితే అనగనగా ఓ రాజు చిత్రాన్నే కంటిన్యూ చేస్తారా. లేక వేరే దర్శకుడుతో మరో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.  ఇక అనగనగా ఓ రాజు చిత్రం  షూటింగ్ కొంత జరుపుకున్న తర్వాత ఎందుకు ఆగిపోయిందనేది ఎవరికీ అర్దం కాలేదు. నవీన్ డేట్స్ దొరకలేదని కొందరు..అవుట్ పుట్ విషయంలో నవీన్‌ సాటీస్‌ఫై అవ్వవద్దన్నాడని మరికొందరు అన్నారు. 

ఈ ఫన్ ఫిల్మ్ కు  క‌ళ్యాణ్ శంక‌ర్ అనే కొత్త డైరక్టర్ .. ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సింది.కానీ అనుకోని విధంగా అనగనగా ఒక రాజుఆగిపోవ‌డంతో ఈ సినిమా స్థానంలో క‌ళ్యాణ్ శంక‌ర్‌తో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ మ్యాడ్ మూవీ చేసి పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే ధ‌మాకా కంటే ముందు శ్రీలీల అంగీక‌రించిన సినిమా ఇది. ఆమె కెరీర్‌లో అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఆగిపోయిన ఫ‌స్ట్ మూవీగా అన‌గాన‌గా ఒక రాజు నిలిచింది. ఏదైతేనేం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదిలిక వస్తుందా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న బిజీలో శ్రీలల డేట్స్ కేటాయించగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరో ప్రక్క నవీన్..  ప్రస్తుతం టాలీవుడ్లోనే టాప్ బేనర్ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.. నవీన్‌ను కలిసి హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంపై అభినందించారు. అంతే కాక నవీన్‌తో తమ బేనర్లో సినిమా రాబోతోందని సంకేతాలు ఇచ్చారు. కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురు చూడాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios