బిగ్ బాస్ షో నుంచి దీక్ష వెళ్లిపోగానే అర్చన, హరితేజల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది. అప్పటివరకు అర్చనకు కావాల్సినంత ఎక్కిస్తూ దీక్షను కమెంట్ చేస్తూ, చేయిస్తూ గడిపేసిన హరితేజ కూడా మూడ్ ఫ్లక్చుయేషన్స్ తో ఏడవటం చూస్తే.. షోలో అనుకున్నట్లే జరుగుతోందనిపిస్తోంది. ఎందుకంటే దీక్ష ఉన్నంత వరకు తమ అసలైన శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోయారు అర్చన, హరితేజలు. కానీ దీక్ష వెళ్లిపోగానే ఇక తమను తామూ ఏమీ అనుకోలేక., మిగతా సభ్యులు కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్లనూ ఏమీ అనలేక మైండ్ బ్లాంక్ అయి.. అర్చన, హరితేజలు ఇద్దరూ ఏడవటం హౌజ్ లో కనిపించింది. ఇక షోలో జోతిష్కుడు వచ్చి సభ్యుల భవిష్యత్ గురించి ఆశలు కలిపించాడు. మరి జోతిష్కుడు ఎవరితో ఏం చెప్పాడు.. 66వరోజు ఇంట్లో ఏం జరిగింది. షో ఎలా సాగింది ఓ కన్నేద్దాం..

 

ఉదయం షో ప్రారంభం పాటతో మొదలైంది. అంతా లేచారు. ఆ తర్వాత ఫ్రెష్ అయాక లివింగ్ రూమ్ లో...అందరూ కూర్చున్నారు. అక్కడే హరితేజ, శివబాలాజీ మధ్య మధ్యాహ్నం వంట గురించి, కూరగాయాలు కటింగ్ గురించి చిన్న డిస్కషన్ జరిగింది.

ఆ తర్వాత కాసేపు షో ఆసక్తిగా సాగింది. దీక్ష హౌజ్ లోంచి వెళ్లిపోయినా.. ఆమె వదిలి వెళ్లిన జ్ఞాపకాలు అర్చనను మరిచిపోకుండా చేస్తున్నాయి. హౌజ్ లో శివబాలాజీతో వున్నప్పుడు అర్చన మెల్లగా దీక్ష టాపిక్ తీసి డిస్కషన్ పెట్టింది.  ఆ అమ్మాయి లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరు అంటూ ఆరోపణలు చేసింది. తన మైండ్  సెట్ వేరు అంది. బైట మీడియాతో ఇంటర్వ్యూల్లో నా గురించి నెగెటివ్ గా చెప్తుంది కదా అంటూ..శివబాలాజీతో తన మనసులో దీక్షపై వున్న అక్కసంతా వెళ్లగక్కేసింది. అంతేకాదు.. మధుప్రియ, కార్తిక గురించి కూడా శివబాలాజీతో చర్చించిన అర్చన.. వాళ్లు కూడా నన్ను చెడ్డది అన్నా.. అది లైట్ కానీ దీక్ష మాత్రం నా గురించి చాలా బ్యాడ్ గా అందరికీ చెప్తుంది కదా అంటూ చర్చ పెట్టగా తాను చాలా భరించింది హౌజ్ లో అంటూ శివబాలాజీ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఆ తర్వాత.. ఒంటరిగా సోఫాలో పడుకున్న అర్చనను శివ బాలాజీ ఏం చేస్తున్నావు అంటూ మందలించగా..

నాలో నేను పాట పాడుకుంటున్నా.. నాకు ఏడుపొస్తోంది అంటూ ఎందుకేడుస్తుందో తెలీక ఏడ్చింది. దాంతో శివబాలాజీ నువు ఏడిస్తే గిచ్చాలని, కొట్టాలని, గుద్దాలని అనిపిస్తది. కానీ కొడితే తట్టుకోలేవు. కాబట్టి వద్దు అంటూ సెటైర్ వేశాడు.

ఆ తర్వాత అక్కన్నుంచి వెళ్తున్న శివ బాలాజీని..ఏయ్ ఏంటి నీ డామినేషన్ అంటూ అర్చన అనగానే... తల దించు అంటూ దగ్గరికి రాగా పారిపోబోయింది అర్చన. ఇక సింహంలా(గర్జిస్టూ) శివబాలాజీ వేటాడి అర్చనను పట్టుకున్నాడు. నవదీప్ కూడా శివబాలాజీకి సాయం చేసి అర్చనను పట్టించాడు. దాంతో ముగ్గురూ దిండ్లతో కొట్టుకున్నారు.

 

అనంతరం మద్యాహ్నం హౌజ్ మేట్స్ కు బిగ్ బాస్ లెటర్ పంపించారు. బిగ్ బాస్ కోరికమేరకు సభ్యులంతా సోఫాలో కూర్చోండి. నవదీప్ లెటర్ వినిపిస్తాడు అనగానే... నవదీప్ చదివి వినిపించాడు. నవదీప్ లెటర్ చేతిలో పట్టుకుని.. మెల్లిగా ఒక్కో పదం చదువుతుంటే... టెన్షన్ తో ప్రెజర్ ఇంకా పెరుగుతోంది. ఏముందో చెప్పు అని అర్చన అడిగింది.

 

ఇక లెటర్ లో.. అర్చన మొదటిసారి బిగ్ బా ఇంటి కెప్టెన్ అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ముగ్గురు రోమియోలున్నారు. ఆ ముగ్గురు రోమియోలకు తమ అందమైన కెప్టెన్ ని... డాష్ డాష్(మెప్పించే) అవకాశం ఇస్తున్నా. రోజంతా కెప్టెన్ ని ఆటపాట మాటలతో మెప్పిస్తారని.. అంటూ చదువుతుంటే... నన్ను మెప్పియ్యరు బిగ్ బాస్. ఆడుకుంటారు.అయినా తట్టుకుంటా లెండి. అంటూ అర్చన మాట్లాడింది. ఇక చివరలో బిగ్ బాస్ అడిగినప్పుడు మెప్పించిన రోమియో ఎవరో చెప్పాల్సి వుంటుంది అని లెటర్ పంపారు బిగ్ బాస్. గెలుపొందిన వారు వారం మొత్తం ఇంటి పనుల నుండి విముక్తి పొందుతారని చెప్పారు. లేఖ చదవడం అయిపోగానే ముగ్గురు కెప్టెన్ ని మెప్పించే ప్రయత్నం చేయాలి అన్నారు.

 

లేఖ చదవటం పూర్తి కాగానే... అర్చనకు ఆది కాఫీ ఆఫర్ చేశాడు. తీసుకుంది. ఇక నవదీప్ బాత్ రూమ్ కు వెళ్తుంటే డోర్ తీసాడు.. అప్పుడే ఆది వచ్చి స్నానం చేయించాలా అంటూ... అర్చన కోసం బాత్ రూమ్ క్లీన్ చేసాడు. మరోవైపు ఈ సందర్భంలోనే బిగ్ బాస్ పై హరితేజ కోపం వ్యక్తం చేసింది. నేను మీ లెటర్ టాస్క్ ని తీవ్రంగా ఖండిస్తున్నానంది. నాకూ ఏదోకటి చెప్తే చేసేదాన్ని కదా. మేల్ డామినేటింగ్. నాకూ పని తగ్గేది కదా.. ఇప్పుడు నేనేం చేయాలి. తోటకూర కట్ట పంపండి. వలుచుకుంటూ కూర్చుంటా అంటూ అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు టాస్క్ లో భాగంగా నవదీప్ అర్చన పక్కపై.. గులాబీలతో లవ్ హార్ట్ షేప్ లో అలంకరించి..అర్చనను ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేశాడు. నీ స్కిన్, త్రోట్ డ్రై అన్నావు కదా అంటూ..హాట్ వాటర్ ఇచ్చాడు. బేబీ స్వీట్ తింటావా...అంటూ ఫ్రిజ్ లోంచి బనానా స్వీట్ తెచ్చిచ్చాడు. ఇక కెప్టెన్ ని బేబీ అంటాడేంటి అంటూ హరితేజతో అర్చన గుసగుసలాడింది. ఇక అప్పుడే బిగ్ బాస్ వచ్చి అర్చన నీకు నచ్చిన రోమియో ఎవరు అని అడగ్గా వెంటనే శివబాలాజీ అని చెప్పింది. చక్కగా వంట చేసి తిండి పెడతాడు కాబట్టి శివనే అని స్పష్టం చేసింది అర్చన. దానికి శివ కూడా అమ్మా.. 3 రోజులే కదమ్మా.. థాంక్యూ అంటూ అర్చనకు ధన్యవాదాలు చెప్పాడు. దాంతో హరితేజ రోమియో.. జులియట్.. అంటూ పాటేసుకుంది.

అనంతరం నవదీప్, అర్చన మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి కనిపించింది. మేమేదో వుంటే.. నువ్వు దానికి బాగలేదు అనటమేంటి అంటూ నవదీప్ అర్చనను ప్రశ్నించాడు. దాంతో నేను ఎమోషనల్ గా ఏదో స్టేజ్ లో వున్నా. ఏడుపొస్తోంది. కొపం వస్తోంది. కానీ ఆపుకుంటున్నానని అర్చన అంది.

అప్పుడు శివబాలాజీ ఏదొచ్చినా ఆపుకోవద్దు. చెప్పాలి. 3రోజులు హాయిగా గడుపుదాం. మూడ్  స్వింగ్, ఎమోషన్స్ అంటున్నావు కదా.. మళ్లీ ఏడుపు రావొద్దంటే ఏడ్చేసెయ్. చికెన్ తినాలనిపిస్తే తింటాం. అలాగే ఇది కూడా. మళ్లీ మూడ్ అనే మాట రాకుండా చేసుకోవాలి. అనగా ఆది నేనెలా అనిపించాను అంటూ అడిగాడు. దాంతో.. నువ్వు జగత్ కిలాడీ రోమియో అని ఆదిని, నవదీప్ ను సైకో రోమియో అని., శివబాలాజీని సేడిస్టిక్ రోమియో అని కమెంట్ చేసింది అర్చన. ఇఖ నవదీప్ మాత్రం నేను ఈ రాత్రి 12 నుంచి మళ్లీ 12 వరకు  నీ రోమియోగా వుంటా అన్నాడు. ఆ టార్చరా నాకొద్దు బాబో అని అర్చన అనగా ప్రతిగా నేను టార్చర్ చేయను ప్రేమిస్తా అంటూ నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. ఇక శివబాలాజీ కూడా నీ ఏడుపే నా ఆనందం అంటూ సరదాగా చర్చ ముగించేశాడు.

ఇక సాయంత్రం 5.30కు అలారమ్ మోగంగానే అంతా 4వ ఎక్కం చెప్పారు కానీ ఆసమయంలో హరితేజ మాత్రం పిచ్చి మూడ్ లో వుంది. దాంతో తనదగ్గరికెళ్లిన ఇంటిసభ్యులు మళ్లీ ఎక్కం మొదలుపెట్టారు. బుజ్జికన్నా అంటూ సెటైరికల్ గా హరితేజను ఓదారుస్తూ అర్చన కాస్త ఓవరాక్షన్ చేసింది. ఆ తర్వాత మూడ్ స్వింగ్ గురించి శివబాలాజీతో అర్చన మరోసారి డిస్కషన్ పెట్టింది. 3 రోజుల్లో ఇంటికి వెళ్తున్నాం కదా అందుకే మూడ్ రకరకాలగా మారుతోంది. అనగా నువ్వు దీక్ష అనే అమ్మాయిని ఎలా చిత్రహింసలు పెడితే సాటిస్ఫై అవుతతావో చెప్పు అని నవదీప్ అడగ్గా..  ఇది ఏం మాథ్స్ ప్లాబ్లెం కాదు. నాక్కూడా కోపం వస్తుంది అంటూ అర్చన ఫైర్ అయింది.

ఇక నాది కూడా ప్రేమనే. దాన్ని ఎలా చుపించాలి అని శివబాలాజీ అడగ్గా... విసుక్కోకుండా చెప్పాలి అని అర్చన బదులిచ్చింది.

మరోవైపు మైండ్ బ్లాంక్ అయిన హరితేజ లోపల బెడ్ రూంలో బెడ్ పైనే పడుకుని శివతో నేను మాట్లాడాలి. కానీ బయటికెళ్లి పిలవాలంటే నాకు కోపంగా వుంది. శివ ఇక్కడికి వచ్చేలా హెల్ప్ చేయండి బిగ్ బాస్. 3 రోజుల్లో వెళ్లిపోతాం కదా.. నా మూడ్ బాగోలేదు. ప్లీజ్ బిగ్ బాస్ అని అడిగింది హరితేజ. మరోవైపు శివబాలాజీ అళ గటం దేనికి, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం అని బతమాలాలా..అంటూ హరితేజ గురించి అర్చన దగ్గర కోపం వ్యక్తం చేశారు.

ఇక సాయంత్రం 6.30కు శివబాలాజీ, హరితేజలు తమ మధ్య గ్యాప్ గురించి చర్చించుకున్నారు. మీకున్నంత మెచురిటీ మాకుండాలని లేదు కదా.. మేం ఎమోషనల్ గా అపండైన్ అవుతున్నాం. మేమేదో మెంటల్ అన్నట్లు అలా ఎందుకు మాట్లాడుతావు అనగా.. శివబాలాజీ నవ్వుతూ.. దీనికేమన్నా రీజనుందా.. పొయెటిక్ గా ఏదో చెప్పేందుకు ట్రై చేస్తే... ఏదో అయింది అన్నాడు. బదులుగా హరితేజ మాట్లాడుతూ నేను చెప్పుకోవట్లేదు. తలకాయలో బోలెడున్నాయి. నేను చెప్పను కానీ.. లోపల చాలా వున్నాయి. నాకున్న టెన్షన్స్ ఎవరి మీద రిఫ్లెక్ట్ అద్దనే లాక్కొస్తున్నా అంటూ హరితేజ చెప్పుకొచ్చింది.

ఇక అనంతరం కిచెన్ లో ఆది, అర్చనలు చర్చిస్తూ.. మనసు లోపల చాలా వుంటుంది. నాకున్న టెన్షన్స్ ఎవరితో చెప్పకూడదని హాండిల్ చేస్తున్నా. మనం మనం వుండే సిటువేషన్ నార్మల్ కాదు. సడెన్ గా హాపీ, సడెన్ గా మూడ్ పాడవుతోంది. అంటుండగా అక్కడికొచ్చిన నవదీప్ అక్కడే వున్న అర్చనతో చిలిపిగా ప్రవర్తిస్తుంటే..ఏయ్ ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నావు ఏంటని అడగ్గా... పిల్లాడు పిల్లాడు అని సంకెక్కిచచ్చుకుంటే ఏదో చేశాడట. అంటూ నవదీప్ నవ్వులు పూయించాడు.

రాత్రి 8.30కి...

అలారమ్ మోగింది. 4వ ఎక్కం చెప్పారు. ఎక్కంచెప్తూ శివబాలాజీకి పనుల నుంచి విముక్తి కల్పించారు. ఆ తర్వాత అర్చన హౌజ్ మేట్స్ తో చర్చిస్తూ... నేను కెప్టెన్. కోరుకోకున్నా అయ్యా. ఏదో సడెన్ గా అన్నా.. అయినా మీపై నా ఉద్దేశం అది కాదు అంటున్నా అని అర్చన చెప్తున్నా... అలా నువ్వు అన్నందుకు మాకు కాలింది. శివా నీక్కూడా కాలేది కానీ లేవు శివా..అన్నాడు నవదీప్. దాంతో అర్చన కావాలని చేస్తున్నారని ఆరోపించగా.. ఆ అవునవును..మేం కావాలని చేస్తున్నాం. నువ్వు మాత్రం చక్కగా వున్నావా అంటూ వాదించుకున్నారు. అప్పుడు ఆది కూడా ఇన్వాల్వ్ కాగా ఏం చెప్తున్నావ్ అని అర్చన అనగా... అయినా నాకోసం కాదుగా అర్చన..అదంతా పోనీ ఇంప్రెస్ అయావా అర్చనా అంటూ ఆదర్శ్ నవ్వు తెప్పించాడు. దానికి బదులుగా నేను ప్రశాంతంగా వుంటే నచ్చదు కదా అంటూ అర్చన వెళ్లిపోయింది.

రాత్రి 8.45కి...

ఆదితో అర్చన ఆర్గుమెంట్. నవదీప్ తో ఆర్గుమెంట్. ఏమన్నావ్ చెప్పు అని నవదీప్ అనగా... నా పీలింగ్ ను అర్థం చేసుకునే అంత నీకు లేదు,,.అని నవదీప్ కు అర్చన సెటైర్ వేసింది. మీరిద్దరూ సింక్ అయారు కాబట్టి సింక్ లో కొట్టుకుంటున్నారు. అంటూ వాదనకు దిగింది. దీంతో అలా కాదు అర్చన... మమ్మల్ని అలా ఎందుకన్నావో క్లియర్ చేయి అంటూ నవదీప్ మళ్లీ నిలదీసాడు. దీంతో నేను జపమాల తెచ్చుకుని పూజ చేసుకుంటా. ఎవరి జోలికి రాను నన్ను వదిలేయండి అంటూ వెళ్లిపోతుంటే నవదీప్ మాత్రం అలా మధ్యలో వెళ్లిపోతే ఎలా, సెట్ చేసుకుందాం రా అంటూ అర్చనను పిలవసాగాడు. అర్చన రాలేదు, తర్వాత కిచెన్ లో...ఆది, అర్చన ఆర్గుమెంట్ పెట్టారు.. అంతలో నే గరం గరం వుంది వెళ్దామా అంటూ హరితేజ లాబీలో వున్న మిగతా ఇంటిసభ్యులను ఇద్దరినీ తీసుకుని కిచెన్ కు వెళ్లింది.  అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఫీలింగ్ నీకే వుంటుందా.. మాకు లేదా... అని ఆది అర్చనను సీరియస్ గా పాయింట్ అవుట్ చేశాడు. నవదీప్ కూడా అక్కడే వుండగా..మీ లాజిక్ పాయింట్ నాకు అర్తం కాలేదంది. అప్పుడు నవదీప్.. నువ్వు రియాక్ట్ అయావు. మేమేదో అన్నాం. మళ్లీ కాంప్రమైజ్ అయింది, అక్కడితో అయిపోయింది కదా..మళ్లీ ఎందుకు స్టాట్ అయింది అంటూ నవదీప్ స్టాట్ చేశాడు. అప్పుడు దానికి అంత రియాక్ట్ ఎందుకు అయావు అంటూ నవదీప్ తో అర్చన వాదులాడింది. మరి అంతా అయిపోయాక మళ్లీ ఎందుకు కెలికావు అని నవదీప్  ఆ వాదనను ముందుకు తీసుకెళ్లాడు. కానీ.., నేను రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేను. అనగా.. ఇటు రా వచ్చి కూర్చో. ఏంగాదు. ఇట్రా అని పిలిచారు. లాబీలో సెంటర్లో కూర్చో బెట్టారు. చర్చ ప్రారంభించారు. దానికి సుముఖంగా లేని అర్చన అక్కన్నుంచి వెళ్తుండగా... రా మాట్లాడుకుందాం. సెట్ చేస్కుందాం అని నవదీప్ తీసుకొచ్చి కుర్చీలో కూచోబెట్టాడు. ఇంతలో అర్చన.. నేనేదో అన్నాఅనగానే నవదీప్ అలా ఎలా అన్నాడు. అరె చెప్పద్దా. ఇప్పుడు కూడా చెప్పనీయరా. నన్ను కుర్జో బెట్టి మాట్లాడించడం నాకిష్టం లేదు. మీరు డామినేటింగ్ కేరక్టర్. నేను మైండ్ సెట్ చేసుకుని వస్తా. కోపాలు మీకే కాదు మాకూ వస్తాయి. నేను కోపం కంట్రోల్ చేసుకుంటున్నా. ఇష్టం వచ్చినట్లు అనొద్దు. అంటూ వెళ్లిపోయింది అర్చన.

దాంతో పొద్దట్నుంచి నీ మూడ్ సెట్ చేసేందుకే మేం మాట్లాడాం. తీరా సెట్ చేసేశాక.. ఏం పీకారు, ఎంటర్ టైన్ మెంట్ లేదు అంటే ఎలా అనిపిస్తుందని నవదీప్ నిలదీశాడు. టాస్క్ లో ఏం పీకట్లేదు అంటే మాకు కాలదా అనగా... నాకు మీ మొహాలు చూడాలని లేదు. అంటూ పది నిమిషాలు వెళ్తానని వెళ్లబోతే ఆది కూడా వెనకే వెళ్లాడు. దాంతో సర్కాజమ్ అక్కర్లేదు అని అర్చన ఆదిని కమెంట్ చేసింది.

9పీఎం,,

తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు మళ్లీ మిగతా నలుగురు కూర్చున్న దగ్గరికి అర్చన వచ్చింది. రారా కూచో అని నవదీప్ అనగానే అంత రియాక్షన్ అక్కర్లేదు అంటూ కూర్చుంది. మనం 3 రోజులు వుండాలి కదా.. ఇక నేనేమీ అనను. నువ్వు లాజికల్ గా... నేను ఎమోషనల్ గా వున్నాను. నేనేం మిమ్మల్ని బ్లేం చేయట్లేదు. నీ లాజిక్స్ నాకు అర్థం కావు. నేను అవుట్ బస్ట్ అయాను అంటూ చెప్పింది. దాంతో ఫైనల్ కు వచ్చాక ఇంకా ఏంటి.. ముందుకెళ్దాం కదా.. అని నవదీప్ అన్నాడు. నాకు ఇలా బ్రేక్ డౌన్ అవుతోంది అంటూ మళ్లీ ఎందుకో తెలీదు కానీ ఏడుపందుకుంది అర్చన.

ఇక రాత్రి 9.30కు బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కోసం జోతిష్కున్ని పంపించారు. తుది గమ్యానికి కొద్ది దూరంలో వున్నారు. షోని ఎలా ముగిస్తారనేది అందరికీ ఆసక్తికర ప్రశ్న. మీ కోసం ఆస్ట్రాలజర్ ని పంపుతున్నా. ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. అని రాత్రి 9.45కి...ఆస్ట్రాలజర్ ను హౌజ్ లోకి పంపించారు.

హౌజ్ లోకి వచ్చిన జ్యోతతిష్కుడు రాధా కృష్ణ.. వచ్చీ రాగానే ముందు మీ అందరికీ కంగ్రాట్స్. తెలుగు వాళ్లంతా మీ గురించే వాల్డ్ కప్ ఫైనల్ లాగా మాట్లాడుకున్నట్లే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఫైనల్స్ గురించి ఏం అనుకుంటున్నారు అని రాధాకృష్ణ ఇంటి సభ్యులను ప్రశ్నించారు. తర్వాత ఫైనల్ కు వచ్చిన మీరంతా.. సెకన్ల తేడాతో విజేతలుగా నిలుస్తారు. ఇక నేను మీ జాతకాలు ఒక్కొక్కరికీ విడిగా చెప్తానని ముందుగా ఆదర్శ్ తో ప్రారంభించారు.

అందరికీ సమాన అవకాశాలున్నాయంటున్న ఆదర్శ్

జోతిష్కునితో మాట్లాడిన ఆదర్శ్ అందరికీ ఈక్వల్ చాన్సెస్ వున్నాయన్నాడు. రిజల్ట్ గురించి ఆలోచించట్లేదని అన్నాడు.అయితే జోతిష్కుడు ఆదితో మాట్లాడుతూ 12వ తేదీ తర్వాత మీ గ్రహస్థితి బాగుంది. మధ్యలో వెళ్తానన్నారు. కానీ గ్రహస్థితి మళ్లీ సరికావడంతో ఫైనల్ స్టేజ్ కు వచ్చారు. ఈ మూడు రోజులు బాగా ఆడండి. మీకు బాగుంది అన్నారు. ఇక ఏమైనా ప్రశ్నలున్నాయా అని అడగ్గా... ఏమీ లేవు అనటంతో.. గ్రహస్థితి బాగుంటే మనం వద్దనుకున్నా వస్తుంది అంటూ జోతిష్కుడు రాధాకృష్ణ ఆశలు కల్పించారు ఆదికి. ఈ సమయంలో లోపల చర్చ... వాళ్లు చెప్పేది అవునో కాదో చెప్పాలని, రిలేషన్ షిప్స్ గురించి కూడా చెప్తారని అర్చన..మిగతా సభ్యులతో ఏదో ఏదో చెప్పింది.

ఐదు సార్లు నామినేట్ అయినా సేవ్ అయిన అర్చన..

ఎలా అనిపించిందది. ఫస్ట్ సింపుల్ గా స్టాట్ అయింది. నాలుగు వారాలు బాగానే సాగింది. నాలుగో వారం నుంచి నామినేషన్ మొదలైంది. ఐదు సార్లు వరుసగా నామినేట్ అయినా సేవ్ అయాను. టైమ్ బాగుంది మీది అందుకే అలా సేవ్ అయ్యారు. చాన్సెస్ వున్నాయి అని సిద్ధాంతి చెప్పడం. నాకు మ్యారేజ్ అవుతుందా అని అడగ్గా.. ఈ ఏడాది ఖచ్చితంగా అయ్యే అవకాశం వుంది. అంటూ ముగించేశారు.

 నవదీప్....

మీ జాతకం చాలా బాగుంది.  బాగా ఆడండి అన్నారు రాధాకృష్ణ. అయితే ఆటకు సంబంధించి మాత్రమేనా లేక వేరే కూడా చెప్తారా అని నవదీప్ అడగ్గా ఆటదే చెప్తానన్నారు. మీరు ఫస్ట్ సీజన్ లో రావడం క్రేజీ. ఏం చెప్తారు అనగా... మూడు వారాలు డిస్టబెన్స్ అనిపించలే. తర్వాత కొంచెం అనిపించింది. కానీ పెద్దగా బాధపడటం ఏం లేదు. అనగా.. మీరు బాధపడే మనస్తత్వం కాదు అన్నారు జోతిష్.  కష్టపడాలి. ఫలితం మన చేతిలో లేదు. చేసుకుంటూ వెళ్లిపోవడమే. మీకు మంచి భవిష్యత్ వుంటుంది అని చెప్పారు. ప్రశ్నలు వున్నాయా అనగా ఇక ఏం లేవన్నారు. ఇక హరితేజను..నువ్వు ఎన్ని ఆటంకాలొచచ్చిననా అనుకున్నది ఏదైనా సాధించగలవు. సాధిస్తావు. అని చెప్పారు ఆస్ట్రాలజర్ రాధా కృష్ణ.

ఇక రాత్రి 10.45కి శివబాలాజీతో జోతిష్కుడు...

మీరు నమ్మదగిన వ్యక్తి. అందరికంటే ఫ్రాంక్. నిలబడతారు అన్నారు. దాంతో మీరన్నట్లు నేను పాజిటివ్ సజెషన్స్ తీసుకుంటాను. సరే మా దుగురిలో ఎవరు గట్టిగా వున్నారు అనడిగారు శివబాలాజీ. దాంతో ఐదుగురిని పోల్చి చెప్పడం కష్టం. ఫేట్ బాగుంటే అన్నీ వస్తాయి. మీరు చాలా దగ్గరగా వున్నారు. ఆల్ ది బెస్ట్ అన్నారు.

అనంతరం జోతిష్కుడు వెళ్లిపోయాక..

హౌజ్ లో అర్చన శివబాలాజీతో... నీలో ఇంత సౌమ్యత చూసి తట్టుకోలేకపోతున్నా. అమ్మా అమ్మా అంటూ సౌమ్యత, శాంతరసం ఇవన్నీ ఒక ముక్కోపి చూపిస్తుంటే.. తట్టుకోలేకపోతున్నానని అర్చన శివబాలాజీతో అంది. పావలా అంటే 10 రూపాయలు చేస్తున్నారు.చాలా ఓవరాక్షన్ చేస్తున్నారని శివబాలాజీని అర్చన అంది.

ఇక అర్తరాత్రి 12.45కి..

కెప్టెన్సీ లో ఏం చేస్తే ఏమవుతుందో తెలీట్లా-అర్చన, రాకరాక వస్తే... ఏం చేయాలో, ఏం చేయొద్దో తెలీక చస్తున్నా అంటూ అర్చన తన గోడు వెళ్లబోసుకుంది. తోటి సభ్యులతో మీరు ముగ్గురు బాగా వుంటున్నారు. మేమే మూడ్ ఎప్పుడెలా వుంటుందో అర్థం కాక చస్తున్నామంది. అలా షో ముగిసింది.