తమిళ నటుడు హరీష్ ఉత్తమన్ 'భైరవ', 'తని ఒరువన్', 'తొడారి' వంటి సినిమాలతో కోలివుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా ఈ నటుడు జిల్, శ్రీమంతుడు, మిస్టర్ ఇలా చాలా చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు.

రీసెంట్ గా ఇతడు తన గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ముంబై లో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసే అమృత అనే యువతితో హరీష్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు.

నవంబర్ 6న కేరళలో గురువాయుర్ టెంపుల్  లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతి కొద్ది మంది స్నేహితులు, పెద్ద సమక్షంలో వీరి వివాహం జరిగింది. 

తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో ఇప్పటివరకు ముప్పైకి పైగా సినిమాలలో నటించిన హరీష్ ఉత్తమన్ ఇండస్ట్రీకి రాకముందు పాపులర్ ఎయిర్ వేస్ కి సంబంధించి కాబిన్ క్రూలో పనిచేసేవారు. దాదాపు ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసిన హరీష్ ఉత్తమన్ 2010లో 'థా' అనే సినిమాలో నటించి సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.