Asianet News Telugu

నోళ్లు మూయించు: రకుల్ కి సపోర్ట్ గా హరీష్ శంకర్

కెరీర్ లో అలాగే దూసుకుపోయి.. నీ పనితోనే విమర్శకుల నోళ్లు మూయి అని హరీష్ ఆమెకి సలహా ఇచ్చారు. రకుల్ ఎంత బిజిగా ఉందో తనకు తెలుసు అని ఆమెకి మద్దతుగా ట్వీట్ చేశారు హరీష్ శంకర్.

Harish Shankar supports Rakul preeth singh with tweet jsp
Author
Hyderabad, First Published Jun 22, 2021, 10:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

'కెరటం’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలకు లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగింది.  అయితే మన్మధుడు 2 తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్  బాగా తగ్గాయి.  వరస ఫ్లాఫ్ లే అందుకు కారణం అని కొందరు అంటటున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రకుల్ అదేం లేదంటోంది.

ఈ నేపధ్యంలో రకుల్ కు టాలీవుడ్‏లో అవకాశాలు రావడం లేదంటూ ఓ ఆంగ్ల పత్రికలో ఓ కథనం వచ్చింది. దానిపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు డేట్స్ సర్ధుబాటు చేయడంలో దయచేసి నా టీమ్ కు సహాయం చేయండంటూ కౌంటర్ వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. లాక్ డౌన్ ఎత్తివేయడంతో.. సినిమా షూటింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్ సర్ధుబాటు కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ ఆంగ్ల పత్రిక.. రకుల్ కు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. అందుకే సినిమాలు చేయడం లేదని ఓ వార్త ప్రచురించింది. ఇది చూసిన రకుల్.. హెడ్ లైన్స్ కోసం ఏదైనా రాసేస్తారు అంటూ ట్విట్టర్ లో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇది నేను ఎప్పుడు చెప్పానా అని ఆశ్చర్యపోతున్నాను. ఫ్రెండ్స్ మనకు కేవలం 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాకు కాకుండా.. కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్ధుబాటు చేయడానికి నా టీమ్ కు సహాయం చేయండి. అంటూ ట్వీట్ చేసింది.

 దీనికి హెడ్ లైన్స్ కోసం ఏదైనా అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇక రకుల్ ట్వీట్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందిస్తూ.. నాకు తెలుగు రకుల్.. షూటింగ్స్ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో.. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చినప్పటికీ.. నీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. కీప్ రాకింగ్ రకుల్.. నీ సినిమాలతో అందరికి సమాధానం చెప్పు అని అన్నారు. రకుల్ ఎంత బిజిగా ఉందో తనకు తెలుసు అని ఆమెకి మద్దతుగా ట్వీట్ చేశారు హరీష్ శంకర్.
 
ఇక రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఒక తెలుగు చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అందులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ నటించాడు. క్రిష్ డైరెక్టర్.  హిందీలో ఆమె చేతిలో 5,6 సినిమాలున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios