Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఫొటో వైరల్,షేర్ చేసిన హరీష్ శంకర్

ఆ ఫొటో చాలా స్టైలిష్ గా ఉండి ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న నేపధ్యంలో ఈ ఫొటో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.  
 

Harish Shankar share a photo of Pawan Kalyan jsp
Author
Hyderabad, First Published Jun 21, 2021, 12:05 PM IST

పవన్ కు సంభందించిన ఏ అప్డేట్ అయినా, ఫొటో అయినా బయిటకు వస్తే...ఫ్యాన్స్ కు వచ్చే ఆ కిక్కే వేరు. ఆ ఫొటోను చూసి తెగ మురిసిపోతారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోని షేర్ చేసారు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. ఆ ఫొటో చాలా స్టైలిష్ గా ఉండి ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న నేపధ్యంలో ఈ ఫొటో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.  

 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరూ 'గబ్బర్ సింగ్' సినిమాను మర్చిపోలేరు. యాక్షన్ కి యాక్షన్.. ఎంటర్ టైన్మెంట్ కి ఎంటర్ టైన్మెంట్ పుల్ గా వున్న సినిమా అది. అందుకే, ఆ రేంజిలో హిట్టయింది. సిని చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ అవుతూండటంతో అంచనాలు రెట్టింపు అయ్యిపోయాయి.ఈ విషయం హరీశ్ శంకర్ కు కూడా తెలుసు. వాటిని అందుకోవటానికి ఆయన రాత్రింబవళ్లూ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ ని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ప్లాన్ లో హరీష్ ఉన్నారట.  

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో పవన్ ఎటువంటి పాత్ర పోషిస్తారనేది అభిమానులకు ఆసక్తిని కలిగించే అంశం. ఈ సినిమాలో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రను పోషిస్తారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేసారని,తెలుగు తెరపై చూడని విధంగా చాలా  గమ్మత్తుగా సాగుతుందని అంటున్నారు.
 
 ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హరీష్ సినిమా దేశభక్తి నేపథ్యంలో ఉండనుందని కొందరు అంటున్నారు. మరికొంతమంది గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. పవన్ పుట్టిన రోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఇండియా గేట్ చూపిస్తూ వెనక సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ ఫోటోలు.. ఓ బైక్.. దాని పైన పెద్ద బాలశిక్ష ఒక గులాబీ పువ్వు ఉన్నట్టుగా డిజైన్ చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harish Shankar (@harish2you)

Follow Us:
Download App:
  • android
  • ios