దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన పోస్ట్ లు పెట్టడమే కాదు.. సామాజిక అంశాలపై కూడా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఒకటి షేర్ చేశారు.

ఈ ఫోటో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి సూపర్బ్ లుక్ లో కనిపిస్తున్నారు. యంగ్ లుక్ లో చిరు ఫోటో షేర్ చేయడమే కాకుండా దర్శకుడు కొరటాల శివపై జెలసీగా ఉందని అన్నారు. దానికి కారణం కొరటాల శివ తదుపరి సినిమా చిరంజీవితో చేయడమే.. ఆ సినిమా కోసమే చిరు ఇలా యంగ్ గా తయారయ్యారు.

''ఈ ఫోటోని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను.. మొదటిసారి నా స్నేహితుడు కొరటాల శివపై జెలసీగా ఉంది. వీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది'' అంటూ హరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది.

చిరంజీవితో మీరు కూడా ఓ సినిమా చేయాలని హరీష్ ని అభిమానులు కోరుతున్నారు. 'గబ్బర్ సింగ్' ని మించే సినిమా రావాలని, గ్యాంగ్‌లీడర్‌, ఘరానా మొగుడులాంటి చిత్రాలు మీ కాంబోలో పడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.