టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. 

టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో 'వాల్మీకి' సినిమాను రూపొందించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకుంటున్నారని, దానికి ఆమె ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని వార్తలు వచ్చాయి.

అయితే వీటిపై క్లారిటీ ఇవ్వడం తన బాధ్యత అంటూ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. అలానే చాలా రోజులుగా అతడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తాడని వస్తోన్న వార్తలపై కూడా స్పందించాడు.

పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, అయితే రీసెంట్ గా పవన్ ని కలిసినట్లు వస్తోన్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తన నుండి కానీ తన నిర్మాతల నుండి కానీ అధికార ప్రకటన వచ్చే వరకు సినీ అభిమానులందరూ ఎదురుచూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. 

Scroll to load tweet…