తెలుగు ఫేమస్ దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. టాలీవుడ్ కు హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఉన్నారు. తెలుగులో ఒక వెలుగు వెలిగిన దర్శకుడి... ఇదే తెలుగులో సినిమా ఇవ్వడానికి ఏవరు ముందుకు రావడంలేదట..? అందుకే బాలీవుడ్ వెళ్ళిన దర్శకుడు సల్మాన్ తో పంప్రదిస్తున్నాడట.
డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్ తీసుకున్నా అంత అద్భుతమైన సినిమా ఇస్తానంటున్నాడు హరీష్. ఇందులో భాగంగా.. బాలీవుడ్ గుమ్మం తొక్కాలని చూస్తున్నాడు హరీష్. తన తదుపరి సినిమాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. దాని కోసం ముంబయిలో మకాం వేశాడట హరీష్. కథ రెడీ చేసుకున్న ఉన్న ఈదర్శకుడు త్వరలోనే సల్మాన్‌ను కలిసి స్టోరీ నెరేట్ చేయనున్నట్లు టాక్. అన్ని కుదరితే ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం . మరీ సల్మాన్.. హరీష్ కథను ఒకే చేస్తాడా? లేదా? అనేది చూడాలి.
యాక్షన్ స్టోరీకి ఫ్యామిలీ డ్రామా తో పాటు కమర్షియల్ హంగులను అద్ది సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ సక్సెస్ లు సాధించిన దర్శకులుహరీష్ శంకర్. హరీష్ శంకర్ సినిమా అంటే అది ఎంత ప్లాప్ అనిపించకున్నా.. ఆడియన్స్ కు మాత్రం మినిమం ఎంటర్‌టైనింగ్ గ్యారెంటీ అని చెప్పాలి. అటువంటి దర్శకుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమా చేసిన తరువాత ఇప్పటి వరకు హరీష్ శంకర్ కు సినిమా లేదు. ఈ దర్శకుడి నుంచి మరో సినిమా రాలేదు. మరి ప్రయత్నాలు చేయలేదా అంటే.. తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ పాలిటికల్ గా బాగా బిజీ అయిపోవడంతో.. సినిమాలకు టైమ్కేటాయించలేకపోతున్నాడు. దాంతో అన్ని సినిమాలు పెండింగ్ పడిపోతున్నాయి. ఇక ఈసినిమాకు కూడా సమయం పట్టేలా ఉంది. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. దాంతో హరీష్ మరో హీరో కోసం భాగా ట్రై చేశాడు. పాపం ఏ హీరో కూడా హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి రెడీగా లేరు.
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వారి వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కోక్క స్టార్ హీరో రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లు అయిపోయేలోపు దాదాపు రెండు, మూడేళ్ళయినా పడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ వర్కౌట్ కాదు అనుకున్నాడో ఏమో.. హరీష్ శంకర్ బాలీవుడ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.ఇక ప్రస్తుతం హరీష్ ఏటీఎమ్ అనే వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దిల్‌రాజు కూతురు హర్షితా రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది.
