అవసరమైన సమయంలో అనుభవంతో చెప్పే పెద్దల మాటలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. రీసెంట్ గా  తన కెరీర్ లో మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి చెప్పిన మాటలను విన్న వరుణ్ తేజ...ఓ కొత్త ప్రాజెక్టుని ఓకే చేసినట్లు సమాచారం. ఇప్పుడీ ప్రాజెక్టు టాలీవుడ్ లోటాక్ ఆఫ్ ది టౌన్ కానుంది. 

మొత్తానికి వరణ్ తేజ్ ని ఒప్పించారు దర్శకుడు హరీష్ శంకర్. గత కొద్ది రోజులుగా వీరిద్దిరి కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం అవబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజం అయ్యాయి. జనవరి 2019 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మొదట హరీష్ శంకర్ ..నాలుగు స్ధంబాలాట టైటిల్ తో ఓ చిన్న మల్టీ స్టారర్ కామెడీ ప్లాన్ చేసారు. 

అయితే అనుకోకుండా కథ ఇలా మలుపు తిరిగింది.  ఆ స్క్రిప్టుని ప్రక్కన పెట్టి  'జిగర్తాండా' రీమేక్ మొదలెట్టారు. తనదైన శైలిలో ఫన్ ని యాడ్ చేసుకుంటూ,వరుణ్ తేజ పాత్రను పెంచి స్క్రిప్టుని డవలప్ చేసారు. అయితే విలన్ గా చేయటం అనేది వరుణ్ తేజ్ కు ఇష్టంలేదు.

కానీ చిరంజీవి ఈ విషయంలో కలగచేసుకుని ...తను కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేసానని, అప్పుడే ఎక్కువ లాంగ్ స్టాండ్ ఉంటుందని చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరో కూడా చేయనున్నారు.  తమిళంలో సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహా విలన్ గా వచ్చిన 'జిగర్తాండా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.