Asianet News TeluguAsianet News Telugu

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్.. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కంప్లీట్..

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరోసారి నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ షూటింగ్ పై తాజాగా డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. 
 

Harish Shankar gave update on Ustaad Bhagat Singh NSK
Author
First Published Sep 30, 2023, 4:46 PM IST

డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో మరోసారి సినిమా చేస్తున్నారు. చివరిగా ‘గద్దలకొండ గణేష్’తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పవన్ తోనే సినిమా చేయాలని పట్టుబట్టి చివరకు సాధించారు. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 

ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. రామానాయుడు స్టూడియోలో మాసీవ్ సెట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే మరిన్ని షెడ్యూళ్లు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సెట్స్ లో సందడి చేసిన ఫొటోలను టీమ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. మరోవైపు హరీశ్ శంకర్ కూడా సినిమాపై అదిరిపోయే అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. 

తాజాగా చిత్ర షూటింగ్ డిటేయిల్స్ ను అందించారు. ఇదివరకే పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీన్లను షూట్ చేసిన టీమ్.. తాజాగా మోస్ట్ ఇంపార్టెంటెంట్ ఇంటెన్స్ పార్ట్ ను కూడా పూర్తి చేసినట్టు హరీశ్ శంకర్ తెలిపారు. హరీశ్ ప్రత్యేకంగా తెలియజేయడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఈ సీన్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు కూడా అర్థం అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ పెర్ఫామెన్స్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలిపారు. ఇలాంటివి మరిన్ని చూడొచ్చని కూడా హామీనిచ్చారు. 

ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇలా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే హరీశ్ పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూళ్లు, పొలిటికల్ ప్రొగ్రామ్స్ కు అనుగుణంగా షూట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు చిత్రీకరణ జరుగుతుండగా.. అటు వెనువెంటనే ఎడిటింగ్ పార్ట్ నూ పూర్తి చేస్తూ వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన కొద్దిరోజుల్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనేది అర్థం అవుతోంది.

‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవన్ - హరశ్ శంకర్ కాంబో సెట్ అవ్వడం పట్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే విడుదలైన గ్లింప్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూ.150 కోట్లతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  కథానాయిక. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios