`నా వెంట్రుక కూడా పీకలేరు`.. హరీష్‌ శంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. సొంత తల్లిదండ్రులే ట్రోల్‌..

దర్శకుడు హరీష్‌ శంకర్‌ `ఈగల్‌` ఈవెంట్‌లో రెచ్చిపోయాడు. ఈ సినిమాని విమర్శించిన ఓ వెబ్‌ సైట్‌ని టార్గెట్‌ చేస్తూ నా వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్‌ చేయడం సంచలనంగా మారింది.

harish shankar fire on one website in eagle event also mention that my parents also trolled beginning arj

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన తరచూ మీడియాపై విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్స్ ని ఆయన టార్గెట్‌ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఓ వెబ్‌ సైట్‌పై ఆయన రెచ్చిపోయాడు. దాన్ని టార్గెట్‌ చేస్తూ నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

రవితేజ హీరోగా నటించిన `ఈగల్` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించింది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ కలెక్షన్లు మాత్రం ఫర్వాలేదు. దీనికి పోటీ ఇచ్చే మూవీ లేకపోవడంతో ఉన్నంతలో బెటర్‌ రిజల్ట్ ని పొందుతుంది.

అయితే ఓ వెబ్‌ సైట్‌ ఈ మూవీకి చాలా లీస్ట్ రేటింగ్‌ ఇచ్చింది. అది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చాడు. తాజాగా `ఈగల్` సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్‌ శంకర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమ్‌ని అభినందించాడు. ముఖ్యంగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మేకింగ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 

ఈ సందర్భంగా సదరు వెబ్‌ సైట్‌ పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మూవీలో లవ్‌ స్టోరీ లేదని రాశారని, కానీ సినిమాలో హీరో గన్ను పట్టుకుని యాక్షన్‌ చేస్తుంటే లవ్‌ స్టోరీ అంటాడేంటి? అంటూ చురకలు అంటించారు. అదే సమయంలో సినిమా జరల్నిస్ట్ లు సినిమా ఇండస్ట్రీలో భాగమే అని, వాళ్లు వేరు, మేము వేరు కాదన్నారు. అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్‌ లేదని, ఏదైనా బాగలేకపోతే దర్శకుడు ఇక్కడ బాగా చేశాడు, ఇక్కడ చేయలేదని చెప్పండి. చేసిన మిస్టేక్‌ ఏంటో చెప్పండి, అది కాకుండా పర్సనల్‌ ఎటాక్‌ చేయడం ఏంటని ప్రశ్నించాడు హరీష్‌. 

కార్తీక్‌ ఘట్టమనేనిని విమర్శించే ముందు ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ చూడాలని, అతను అద్భుతమైన కెమెరామెన్‌ అని, సినిమాలు చేస్తే ఇప్పుడు అతని చేతిలో పది సినిమాలుంటాయి. అంత బిజీగా ఉంటాడు. కానీ సినిమాటోగ్రాఫర్‌గానే కాదు, దర్శకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. చాలా కష్టపడి అద్భుతమైన సినిమా తీశాడు. ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా అభినందిస్తుంది. విమర్శించే ముందు అతను జర్నీ ఏంటి? ఏం చేశాడు? ఎలాంటి సినిమా తీశాడనేది ఆలోచించాలి కదా అని అన్నారు. 

కార్తీక్‌ని ఇలా విమర్శించడంపై చాలా బాధేసింది. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఈ బ్యాచే(ఆ వెబ్‌ సైటే) `ఆర్‌ఆర్‌ఆర్‌`లో రొమాన్స్ లేదని రాశారట అని గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమ అంటే సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లతోపాటు సినీ జర్నలిస్ట్ లు కూడా అని తెలిపారు. మీరు మామీద, మేం మీద రాళ్లు ఏసుకోవడానికి మీరు ఆ గట్టున, మేం ఈ గట్టున లేం. అందరం ఒకే గట్టున్న ఉన్నాం. సినీ జర్నలిస్ట్ సినిమాలో భాగమే అని తెలిపారు హరీష్‌ శంకర్‌. ఈ సందర్భంగా సురేష్‌ కొండేటి సంఘటన గుర్తు చేశారు. ఆయన్ని విమర్శించినందుకు తను 200కాల్స్ వచ్చి బాగా అన్నారని అంటున్నారట. అది విని తనకు బాధేసిందని, తను అలా అనకుండా ఉండాల్సిందని తెలిపారు.

తన సినిమాని అన్ని పార్టీల వాళ్లు చూడాలని కోరుకుంటానని, పవన్‌ కళ్యాణ్‌ అదే తనకు చెబుతారని, సినిమా వేరు, రాజకీయం వేరుగా చూడాలని చెబుతుంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఏవైనా అనాలనుకుంటే మా మీద వేయండని, కొత్తవాళ్లమీదు ఎందుకంటూ మండిపడ్డాడు. అంతేకాదు ఆ వెబ్‌ సైట్‌ ప్రస్తావన తెస్తూ తన వద్ద సినిమా లేవని రాశారని తెలిపారు. అంతేకాదు సినిమా చేయకుండా రాత్రిళ్లు నిర్మాత ఇంట్లో మందు తాగుతున్నట్టుగా రాశారని, నువ్వేమైనా చూశావా? నువ్వేమైనా ఐస్‌ కలిపావా అంటూ చురకలంటించాడు హరీష్‌. అది కూడా షాడో పెట్టి రాశాడని, నా పేరు పెట్టి, నా ఫెట్టి రాసే ధైర్యం లేదని, దమ్ముంటే అలా రాయమని సవాల్‌ విసిరాదు హరీష్‌. ఫైనల్‌గా ఇంత జరిగినా మీరు వేరు, మేం వేరు అంటే ఓ పెద్దాయన చెప్పినట్టు `నా వెంట్రుక కూడా పీకలేరు` అనే దాన్ని సైగ చేసి ముగించాడు హరీష్‌. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్‌ శంకర్‌.. రవితేజ హీరోగా `మిస్టర్‌ బచ్చన్‌` సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్‌ నుంచి డైరెక్ట్ ఈ `ఈగల్‌` సక్సెస్‌ మీట్‌కి వచ్చారు. దీంతోపాటు ఆయన పవన్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీఉంది. అంతేకాదు మరో రెండు పెద్ద హీరోలతో సినిమాలు ఉన్నాయని హరీష్‌ చెప్పడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios